ఈ రోజు నా బైబిల్ రీడింగ్ ప్లాన్ ప్రకారం ఆదికాండం 27 వ అధ్యాయం చదువుతున్నాను. ఈ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన నుండి నాకు కలిగిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. పాపం ఎంత తీవ్రమైనదో , అది ఎటువంటి ఫలితాలను తీసుకువస్తుందో మనం గ్రహించడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఆది 27:18,19 - యాకోబు తన తండ్రి వద్దకు వచ్చి - నా తండ్రి అని పిలువగా , అతడు - ఏమి నా కుమారుడా నీవెవరివి అని అడిగెను. అందుకు యాకోబు - నేను ఏశావు అను నీ పెద్ద కుమారుడను ఇది మొదటి తప్పు. తన తల్లి చేయమన్నట్లుగా చేయడం వలన ఇప్పుడు తప్పులు చేయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు , దేవుడు చేయమన్నది చేయకుండా , లోకం చేయమన్నది చేసినప్పుడు మనం కూడా ఇలాగే తప్పులు లేదా పాపం చేసే అవకాశం ఉన్నది. 27:20 - అప్పుడు ఇస్సాకు నా కుమారుడా , ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా , అతడునీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను. రెండవ తప్పు. చేసిన తప్పు కప్పి పుచ్చుకోవాలంటే మరొక తప్పు చేయడం ఇక్కడ మనం చూడగలం....