Skip to main content

Posts

Showing posts from 2024

మనకొరకు మీకా మాటలు

  4:5 - సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు ,  మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము . ఆ రోజుల్లేనే ప్రజలు వివిధ దేవుళ్లు దేవతలను పూజించేవారు . అటువంటి ప్రజల మధ్య గల ఆయన నిబంధన ప్రజలు   వారి దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని మీకా ప్రవచిస్తున్నాడు . స్మరించుకోవడం అంటే రోజంతా ఆయన నామాన్ని ఉచ్చరించడం కాదు , ఆయన అధికారం క్రింద ఉండి , ఆయనకు విధేయత చూపడం .  1-4 వచనాల్లో అంతిమ విమోచన జరగబోతుంది , విమోచన కర్త తన పని సంపూర్ణం చేయబోతున్నాడు కావున మనం మన దేవుణ్ణి ధ్యానిస్తూ  ఆయన మాటలకు లోబడుతూ బ్రదుకుదాం, అని మీకా బోధిస్తున్నాడు .  ఇది ప్రస్తుతం ఉన్న మనకు సరిగ్గా వర్తిస్తుంది . మన చుట్టూ వివిధ మతాలు , వారు పూజించే వివిధ దేవుళ్లు దేవతలు ఉన్నారు . వారు వారి దేవతలను దేవుళ్లను   నిష్ఠగానే పూజిస్తున్నారు , ఆరాధిస్తున్నారు . తమ శరీరాలను నలగకొట్టుకుంటున్నారు , దూర ప్రయాణాలు చేస్తున్నారు , డబ్బు , బంగారం అర్పిస్తున్నారు , ...

అవిధేయత నుండి విధేయతకు

  యోనా 1:1-3  యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.   నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.   అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ,  ప్రయాణమునకు కేవు ఇచ్చి ,  యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.   దేవుని మాటకు అవిధేయత చూపి దూరంగా పారిపోయాడు .   యోనా 3:1-3  - అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా   నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.     ​ కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను.   దేవుని మాటకు విధేయత చూపాడు.  మధ్యలో ఏం జరిగింది?    తుఫానులో చిక్కుకున్నాడు   సముద్రంలో పడవేయబడ్డాడు  మత్స్యము కడుపులో మూడు రోజులు శ్రమను అనుభవించాడు.    ఈ శ్రమలు కలుగజేసింది...

క్షమాపణ

  పాత నిబంధనలో దావీదు పేరు వినగానే మొదటగా తాను గొల్యాతును చంపిన విధానం, ఆ తర్వాత బత్సేబాతో చేసిన పాపం గుర్తుకువస్తుంది. దేవుని హృదయానుసారునిగా పిలవబడిన దావీదులో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుగోగలం. అది 2 సమూయేలు పుస్తకంలో మనం చూస్తాం.  2 సమూ 15:13,14లో ఇశ్రాయెలీయులు అభ్షాలోము వైపు ఉన్నారని తెలిసిన దావీదు, అభ్షాలోము నుండి మనం పారిపోదాము రండి అని పట్టణం విడిచి వెళ్లిపోతాడు. ఆయనతో పాటు చాలా మంది అరణ్యానికి పయనమైతారు. 2 సమూ 16లో దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమీ అనే వ్యక్తి దావీదును శపిస్తాడు (5వ). దావీదు మీద మరియు అతని సేవకుల మీద రాళ్లు రువ్వుతాడు (6వ). అంతేకాదు, నరహంతకుడా,దుర్మార్గుడా, ఛీ పో, నువ్వు నరహంతకుడవు కాబట్టే నీకు ఈ గతి పట్టింది అని చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి దావీదును శపిస్తాడు.  కానీ, సౌలును దావీదు చంపించలేదని మనకు తెలుసు. సౌలును చంపే అవకాశం రెండు సార్లు వచ్చినా దావీదు చంపలేదు. సౌలు కొన ప్రాణంతో ఉండగా చంపినవాడిని ఉద్దేశించి "యెహోవా అభిషేకించినవానిని చంపడానికి నీవేల చెయ్యి ఎత్తావు? అని వాడిని చంపించాడు దావీదు (2 స...