గుడ్ ఫ్రైడే అంటే తెలుగులో శుభ శుక్రవారం.
క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఒక పండుగ గుడ్ ఫ్రైడే. ప్రభుత్వాలు కూడా ఈ రోజును సెలవు దినంగా ప్రకటించాయి.
అసలు గుడ్ ఫ్రైడే నాడు జరిగిందేమిటి ? శుభ శుక్రవారం రోజు జరిగిన శుభం ఏమిటి ?
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.
ఆసియా ఖండంలోనే గల యెరూషలేము అనే పట్టణానికి ఒక సారి వెళ్లొద్దాం. ఆ రోజు శుక్రవారం.
ఒక వ్యక్తి భారమైన సిలువ మోస్తూ, కష్టంగా నడుస్తున్నాడు.
కొరడా దెబ్బలు ఆయన శరీరంలోని మాంసాన్ని లాగి పడేస్తున్నాయి.
తలపై ముళ్లతో అల్లిన కిరీటం తన మొఖాన్ని రక్తంతో నింపేసింది.
రోమా ప్రభుత్వానికి చెందిన భటులు ఆ వ్యక్తిని అపహసిస్తూ, అతి దారుణంగా కొడుతూ గొల్గోతా కొండ పైకి తీసుకెళ్తున్నారు. అసలే సిలువ భారం, ఒళ్లంతా గాయాలు, ఆపై ఎత్తైన కొండ మీదికి ప్రయాణం.
ఆ వ్యక్తి ఎంతగా బాధననుభవిస్తున్నాడో తల్చుకుంటే దుఃఖం పెల్లుబికి వచ్చిందేమో, ఒక తల్లి విపరీతంగా ఏడుస్తూనే ఉంది.
కొండ మీదకు రాగానే, ఆయన బట్టలు తీసేశారు. ఆయన మోసిన సిలువ మీద ఆయన్నే పడుకోబెట్టి,
రెండు చేతులను చెరో వైపు లాగి, చేతుల నుండి, కాళ్ల నుండి సిలువకు మేకులు కొడుతుంటే,
మనుషులు ఇంత కర్కశంగా ఉంటారా అనిపిస్తుంది.
అసలు ఇంత ఘోరంగా శిక్షించడానికి ఆ వ్యక్తి చేసిన తప్పేంటి అనే ప్రశ్న మాటి మాటికి వేధిస్తూనే ఉంది.
ఇంతలో సిలువ మీద నుండి, " తండ్రీ, వీళ్లు చేస్తున్నదేంటో వీళ్ళకి తెలియట్లేదు, క్షమించండి" అని
బాధాతప్త స్వరంతో ఆ వ్యక్తి పలికాడు.
వీళ్లు చేస్తున్నదేమిటి ? వీరికి క్షమాపణ దేనికి ? అనే ప్రశ్నలు మనకు రావొచ్చు.
అవి తెలుసుకోడానికి ముందు ఇంకా అక్కడేం జరిగిందో చూద్దాం.
సిలువ మీద నొప్పితో ఉన్న వ్యక్తి " నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, అయినా నీ ఇష్టమే జరుగును గాక" అని "ఇదిగో, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను" అనే చివరి మాటతో తనువు చాలించాడు.
ఒక్కసారిగా ఉరుములు,మెరుపులు. నిలబడ్డ చోటంతా భూమి కంపించడం మొదలయ్యింది.
వాతావరణం కాస్త అదుపుతప్పినట్లు అర్థమవుతుంది.
అక్కడ నిలబడ్డ శతాధిపతి " ఈయన నిజంగా దేవుని కుమారుడే" అన్న మాటలు, ఆ ఉరుముల శబ్దాల్లో కూడా చాలా చక్కగా వినిపిస్తున్నాయి.
శుభ శుక్రవారం నాడు జరిగిన శుభం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు, సిలువ మీద ఆ వ్యక్తి మరణంగా చెప్పొచ్చు.
ఒక వ్యక్తి చావు శుభం ఎలా అవుతుంది ?
ఎందుకంటే, ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి,
ఎందుకంటే, ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి,
ఎందుకంటే, ఆ వ్యక్తి శతాధిపతి చెప్పినట్లు దేవుని కుమారుడు కాబట్టి,
ఎందుకంటే, ఆ వ్యక్తి,తన ప్రజలను వారి పాపముల నుండి క్షమించడానికి మానవుడిగా
జన్మించి, మరణించిన దేవుడు కాబట్టి.
మనిషి పుట్టుకతోనే పాపానికి దాసుడై, పాపలోకంలో పాపముతో నిండినవాడై, కన్నులతో, ఆలోచనలతో, మాటలతో, కార్యాలతో పాపం చేస్తూ నరకానికి పయనిస్తున్నాడు.
కుల, మత,జాతి, ప్రాంత,సామాజిక నేపథ్యమనే భేదాలు లేకుండా, ప్రతి వ్యక్తి కూడా పాపానికి బానిసై
జీవిస్తున్నాడు. పాపమును ఆస్వాదిస్తూ దాని తాత్కాలిక సంతోషాన్ని అనుభవిస్తూ, పాపం యొక్క నిత్యశిక్షకు పాత్రుడవుతున్నాడు
పాపముతో నిండిన ఈ ప్రజలను కాపాడేది ఎవరు ?
అందరూ పాపులే, అందరూ అసహాయులే, అందరూ చచ్చినవారే. ఏ వ్యక్తి కూడా తనను తాను కాపాడుకోలేడు. మరే వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని కాపాడలేడు.
అందుకే, దేవుడు తన ప్రియ కుమారుడైన, యేసుక్రీస్తును తన ప్రజల పాప ప్రాయశ్చిత్తం కొరకు ఈ లోకానికి పంపాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి, సిలువలో యేసుక్రీస్తును నలుగగొట్టుట్టకు ఇష్టపడ్డాడు. ఆయన పొందిన గాయాల చేత, ఆయన ప్రజలకు వారి పాపాలనుండి స్వస్థతను విడుదలను విమోచనను అనుగ్రహించాడు.
ఆ యేసుక్రీస్తు మరణ దినాన్ని గుర్తుచేసుకోడానికి, ప్రపంచం శుభ శుక్రవారం అనే పండుగ
చేసుకుంటుంది.
ఒక మనిషి చనిపోతే అందరూ ఏడుస్తారు, బాధ పడతారు కానీ పండగ చేసుకోరు, సంతోషించరు.
కానీ యేసుక్రీస్తు మరణిస్తే అది పాపులైన ప్రజలకు పండగే.
ఎందుకంటే ఆయన మరణించకపోతే, పాపానికి విరుగుడు, పాపం నుండి విడుదల మనిషికి దొరికేది కాదు.
గుడ్ ఫ్రైడే అంటే ప్రాథమికంగా, చక్కగా అలంకరించుకొని చర్చికి వెళ్ళడం కాదు. యేసుక్రీస్తును పాపక్షమాపణ నిమిత్తం విశ్వసించడం.
గుడ్ ఫ్రైడే అంటే, రన్ ఫర్ జీసస్ అని రోడ్లమీద పరుగెత్తడం కాదు, ఆయన్ను, ప్రతిదినం వాక్యానుసారంగా వెంబడించడం.
మతపరమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా చలామణి అవుతూ, క్రీస్తుని వాక్యానుసారంగా నమ్ముకోకుండా, ఆయనను వాక్యానుసారంగా వెంబడించకుండా, ప్రతిరోజూ వాక్యపు ఆజ్ఞలను పాటించకుండా
కేవలం గుడ్ ఫ్రైడే,ఈస్టర్, క్రిస్మస్ అనే రోజుల్లో హడావుడి చేసేవారు, ఒకరోజు దేవుని యెదుట
తీర్పు తీర్చబడుటకు సిద్ధపడుతున్న వాళ్ళే.
పాపం చేత చెడిపోయిన ప్రజలను రక్షించడానికి, పాపరహితుడైన పరిశుద్ధ దేవుడు, తన ప్రాణమును
పాపం చేత చెడిపోయిన ప్రజలను రక్షించడానికి, పాపరహితుడైన పరిశుద్ధ దేవుడు, తన ప్రాణమును
ప్రాయశ్చిత్తముగా అర్పించిన విషయమే గుడ్ ఫ్రైడే సందేశం.
ఈ మాటలు, కేవలం ఒక్క రోజు గుర్తుతెచ్చుకునేవి కాదు. ప్రతిరోజూ అవసరమైన ప్రాముఖ్యమైన మాటలు.
ఈ మాటలు ధ్యానిస్తూ గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని మన జీవితాల్లో అన్వయించుకొని, క్రీస్తు కొరకై జీవించి ఆయనకొరకై ఆత్మీయ ఫలాలు ఫలిద్దాం.
@ Dr Shankar Babu K

Wonderful Message Brother. Thank you.
ReplyDeletePastor SAM BABU, Miyapur, Hyd.
Thank You Anna..Praise be to God
DeleteWonderful truth about good Friday ..Anna very blessing
ReplyDeleteThank you brother, Praise be to God
ReplyDeleteFantastic work dear Thammudu, Dr. Shankar
ReplyDeleteThanks anna
ReplyDeleteExcellent Anna Super
ReplyDeleteబాబు ఛాలా బాగా రాసేవు
ReplyDeleteBiblically Sound and Healthy Telugu article
ReplyDelete