నేటి రోజుల్లో చాలా మంది భార్యా భర్తలు సరియైన వాక్యానుసారమైన అవగాహన లేకపోవడం వల్ల, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అంతే కాక విడాకులు కూడా తీసుకొని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇది సమాజానికి, ఆ కుటుంబంలో గల పిల్లలకి మంచి పరిణామం కాదు. భార్యా భర్తలు తమతమ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబం స్థిరంగా నిలబడుతుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ, నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. I. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి ( ఎఫెసీ 5:33 ) ఏ విధంగా ప్రేమించగలం? 1. నీ భార్యతో ప్రత్యేక సమయం గడపడం. అంటే, రోజువారీ పనుల్లో మాట్లాడే మాటలు కాకుండా, ఒక ప్రత్యేక సమయంలో తను ఎలా ఉంది, తనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తను ఏమైనా నీ నుండి ఆశిస్తుందా అన్న ప్రశ్నలు వేస్తూ చర్చించుకోవాలి. 2. నీకు వీలైనప్పుడల్లా, కొన్ని సార్లు వీలుచేసుకొని ఇంట్లో పనుల్లో నీ భార్యకి సహాయం చేయడం. 3. భర్తగా, కుటుంబ పెద్దగా నువ్వు తీసుకునే నిర్ణయాల్లో తన అభిప్రాయం కూడా తీసుకోవడం. అంతిమ నిర్ణయం నీదే అయినా నీ భార్య అభిప్రాయం తీసుకోవడం ఆమెని ప్రేమించే అవకాశం పొందుకోవడమే. 4. ఆత్మీయ విషయాల్లో ఆమ...