పొర్నోగ్రఫీ అనే మాటకు అర్థం తెలుగు ప్రజలకు మరియు ఇతర రాష్ట్రాల్లో గల చిన్నగ్రామాల్లో పట్టణాలలో గల ప్రజలకు అర్థం తెలియకపోవచ్చు.
అశ్లీల రచనలు లేదా బూతు సాహిత్యాన్ని పొర్నోగ్రఫీ అంటారు.ఇంటర్నెట్ సదుపాయం మరియు మొబైల్ ఫోనులు లేకమునుపు పుస్తకాలలో పత్రికలలో ఈ అశ్లీల సాహిత్యం మరియు అశ్లీల చిత్రాలు ప్రజలకు లభించేవి.
కానీ 4G వేగంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న ప్రపంచం అంతే వేగంగా మొబైల్ ఫోనులో ఈ అశ్లీల చిత్రాలు, వీడియోలు, సినిమాలు చూడడంలో కూడా అభివృద్ధి చెందుతుంది.
మన భారతదేశం ఈ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా, టాప్ 10 దేశాల లిస్టులో చేరింది.
క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు ఈ పొర్నోగ్రఫీకి అతీతులేమి కాదు.
సంఘములో కూడా దీని వ్యసనం బారిన పడిన ప్రజలు ఉంటారని నేను నమ్ముతాను.
కొందరు ఈ వ్యసనం నుండి బైటపడాలని ప్రయత్నిస్తుంటారు, మరికొందరు ఎలా బయటపడాలో అర్థం కాక నలిగిపోతుంటారు.
ఈ ఆర్టికల్ పొర్నోగ్రఫీకి బానిసలుగా బ్రతుకుతున్న సోదరసోదరీమనులకు దాని నుండి బైటపడడానికి ప్రోత్సాహామందిస్తుందని ఆశిస్తున్నాను.
అసలు ఈ వ్యసనానికి వ్యక్తులు ఎందుకు అలవాటు
పడతారో ముందుగా తెలుసుకుందాం.
1. స్వాభావికంగా మనుషులు పాపముచేత మలినమై,పాపము చేయడానికి త్వరపడతారు.
అంతరంగములో గల పాప స్వభావం మనిషిని పాపం చేయడానికి శతవిధాల శోధిస్తుంది.
కామపూరితమైన ఆలోచనలు,చూపులు,కోరికలు ఇవ్వన్నీ పాపం యొక్క ఫలితాలై మానవాళిని ఈ అశ్లీల సాహిత్యానికి బానిసలుగా చేశాయి.
ప్రతి పాపం కూడా దేవునికి విరోధమైనది మరియు దేవుడు మెచ్చనిది కాబట్టి, పొర్నోగ్రఫీకి అలవాటుపడిన వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడని తెలుసుకోవాలి.
నీ మొబైల్ ఫోను లేదా ల్యాప్ టాప్ లో నువ్వు చూసే అశ్లీల చిత్రాలు మరియు వీడియోలు నిన్ను సృష్టించిన దేవుడు అసహ్యించుకునేవని తెలుసుకొని, వాటికి NO చెప్పడానికి సిద్ధపడాలి.
2. పొర్నోగ్రఫీకి బానిసలవ్వడానికి మరో ముఖ్య కారణం
అసలు పొర్నోగ్రఫీ అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి లేదా ఉత్సుకత.
అనవసరంగా ఏముందో చూడాలనే ఆసక్తి
మెల్లి మెల్లిగా అలవాటుగా ఆ తదుపరి
ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఫోనులో లేదా కంప్యూటర్
మీద పని చేస్తున్నపుడువచ్చే pop-upలు
చూసి, ఏముందిలే ఒకసారి తెరిచి చూద్దాం
అనే ధోరణి, చివరికి అలవాటుగా మారవచ్చు.
3. ఒంటరితనం లేదా మానసిక నిరాశ.
ఒక విధంగా చాలా మంది యవ్వనస్తులు
పొర్నోగ్రఫీ కి అలవాటు పడడానికి
కారణమైయున్నవి.
మనకున్న మానసిక ఒత్తిడిని నివారించడానికి
ఇటువంటివి చూడడంలో తప్పేమీ లేదనే
అపోహలో కూడా దీనికి అలవాటు పడుతున్నారు.
అందరూ చూస్తున్నారు కాబట్టి పర్వాలేదులే అనే తత్వం కూడా ఈ వ్యసనానికి కారణం.
కలిగే అనర్థాలను గురించి ఇప్పుడు చర్చిద్దాం.
క్రైస్తవుడు ఈ పాపమును తన వ్యక్తిగత
జీవితంలో భాగముగా చేసుకొన్నపుడు
ప్రాథమికంగా దేవునితో తన సహవాసమును కోల్పోతాడు.
పాపమునకు సంబంధించిన అపరాధభావంతో ప్రభువును ఆరాధించక, వాక్యంలో ఆనందించక సంఘ సహవాసమును కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది.
చేసిన తప్పుకు బాధపడుతూ,క్రుంగిపోతూ కొన్ని సార్లు డిప్రెషన్ కి గూడా గురవుతుంటారు.
పొర్నోగ్రఫీ అనేది డిప్రెషన్ కి కారణంగా
మరియు ఫలితంగా వ్యక్తులను ఇబ్బంది పెడుతుంది.
ఈ వ్యసనానికి బానిసలైనవారు డ్రగ్స్ కి బానిసలయ్యే
ప్రమాదం ఉంటుంది.
అంతే కాక, పెళ్ళికిముందే పొర్నోగ్రఫీకి
అలవాటుపడినవారు పెళ్లి తర్వాత
భార్యాభర్తల మధ్య జరగాల్సిన సెక్స్ లో
ఆనందం పొందుకోలేరు.
కొన్నిసార్లు ఈ వ్యసనం వల్ల
భార్యా భర్తలు విడాకులు తీసుకునే పరిస్తితి
కూడా వస్తుంది.
అతిప్రాముఖ్యంగా, ఈ వ్యసనానికి బానిసలుగా బ్రతుకుతున్నవారిని బైబిల్
నిత్య నరకానికి పాత్రులు అని కూడా హెచ్చరిస్తుంది.
అందుకే ఒకాయన ఈ విధంగా అన్నాడు,
" Porn will cost Your Soul".
క్రైస్తవునిగా ఈ పొర్నోగ్రఫీ నుండి
విడుదలకై చేయదగిన విషయాలు
1. మొదటిగా, నీ పాప క్షమాపణకై నీ కొరకు
సిలువ మరణం పొందిన యేసుక్రీస్తునందు
విశ్వాసముంచుట చాలా ముఖ్యమైయున్నది.
నీ పాపము నిన్ను దేవుని నుండి వేరుచేసి
నిత్య శిక్షకు పాత్రునిగా చేస్తుంది కాబట్టి
నీ పాపఫలితమైన నరకాన్నితప్పించుటకు
నీ స్థానంలో మరణించిన క్రీస్తు మాత్రమే నిన్ను
రక్షించగలడు కావున నీ పాపములు ఒప్పుకోని
ఆయనయందు విశ్వాసముంచుము.
2. రెండవదిగా, నీవు విశ్వాసివైతే కేవలం
క్రీస్తు మాత్రమే నిన్ను ఈ వ్యసనం నుండి
విడిపించగలడని విశ్వసించబద్ధుడవైయున్నావు.
యోహాను 8:34 లో "పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని" చెప్పిన పిదప 36 వ వచనంలో " కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు " అని చెప్పబడింది.
కావున, ఆయన మాత్రమే పొర్నోగ్రఫీ నుండి నీకు
విడుదలనివ్వగలడు అని విశ్వాసించాలి.
3. మూడవదిగా, బైబిల్ వాక్యాన్ని ధ్యానించి దేవునికి ప్రార్థన చేయుటలో ఏడతెగక కొనసాగవలసిన అవసరం ఉన్నది.
వాక్య ధ్యానము, ప్రార్థన క్రైస్తవునికి శోధన తప్పించే
ఆయుధములు కావున వీటిని నిర్లక్ష్యం చేయకుండా పాటించాలి.
మన స్వంత శక్తితో ఈ శోధనను జయించలేము కావున
దేవుని శక్తికై సహాయముకై అర్థించాలి.
4. నాలుగవదిగా, ఇటువంటి శోధనల్లో ఒంటరిగా పోరాడడం
కష్టం కాబట్టి ఆత్మీయులైన స్నేహితులు లేదా సంఘములో గల పరిణితి చెందిన పెద్దలకు జవాబుదారీతనంగా ఉండడం చాలా మంచిది.
నిన్ను ప్రోత్సాహపరిచే, నీకై ప్రార్థన చేసే ఈ విషయంలో నీకు సహాయం చేసేవారు ఉండడం నీకు ఆశీర్వాదకరం.
అయితే నీ పాపములు దాచుకోకుండా వారితో పంచుకున్నపుడే నీకు వారు సహాయం చేయగలరని మరచిపోవద్దు.
5. ఐదవదిగా, నిన్నుఈ శోధన గుండా తీసుకెళ్ళే సాధనాలను
దూరం పెట్టడానికి వెనుకాడకూడదు.
ఏదైనా పుస్తకం, సెల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ నిన్ను పొర్నోగ్రఫీకి బానిసను చేస్తున్నట్టయితే వాటిని తీసివేయడం లేదా కొన్ని క్రమశిక్షణలు పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించడం
చాలా అవసరం.
6. ఆరవదిగా, శోధన కలిగినపుడు దానికి దూరంగా పరుగెత్తడం బలహీనత కాదు, దేవుని మాటకు లోబడే ఆశీర్వాదం కావున, వెంటనే శోధన నుండి తప్పించుకోడానికి ప్రయత్నించాలి.
7. ఏడవదిగా,సాధ్యమైనంతవరకు ఒంటరిగా ఉండకుండా ఇతరులతో ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే, దాదాపు గదిలో ఒంటరిగా ఉన్నపుడే ఈ శోధనలు కలుగుతుంటాయి.
సంఘ సహవాసం,సోదరులతో సమయం గడుపుతూ ఆత్మీయ వాతావరణంలో ఉండేటట్టు చూసుకోవాలి.
ఒక విషయం గమనిద్దాం : మన రోజూ వారి కార్యక్రమాల్లో
మార్పులు తీసుకుని రాకుండా, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఈ శోధన నుండి తప్పించుకోలేము.
8. చివరిగా, పాపములో పడిపోయినపుడు ప్రభువు యొద్ద
ఒప్పుకొని, తిరిగి చేయనని ప్రార్థించి, పాపము చేయకుండా ప్రయత్నం చేయాలి.
పొర్నోగ్రఫీని ఆనందిస్తూ, మాటి మాటికీ అదే పని చేస్తూ,
ప్రభువా సహాయం చేయమని అడగడంలో అర్థమే లేదు.
నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువు వద్దకు వచ్చినపుడు, దేవుడు నమ్మదగినవాడు కావున నీ పాపము క్షమిస్తాడని నమ్మాలి.
క్రీస్తు సిలువ కార్యం ద్వారా సాతానుని ఓడించాడని,
నీవు విజయుడైన ప్రభువు వైపు ఉన్నావని విశ్వసించాలి .
నిన్ను రక్షించిన, నీతిమంతునిగా తీర్చిన, ఆయన కుటుంబంలో సభ్యునిగా చేసి నీకు నిత్య జీవమిచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రైస్తవ క్రమశిక్షణల్లో ఎదుగుటకు ప్రయత్నిస్తూనే ఉండాలి.
పొర్నోగ్రఫీ నుండి విడుదల పొందుటకు
దేవుడు నీకు సహాయం చేయును గాక.

thank you brother
ReplyDelete