మన చుట్టూ ఎన్నో స్థానిక సంఘాలు పెద్ద పెద్ద సంఖ్యలపై
ప్రత్యేక కార్యక్రమాలపై, కొత్త పుంతలు తొక్కుతూ
పరిచర్యలు కొనసాగిస్తున్నాయి.
కానీ విచారకరంగా చాలా స్థానిక సంఘాలు వాక్యానుసారమైన
లక్షణాలు లేకుండా అనారోగ్యకరమైన రీతిలో
సంఘాలు కొనసాగుతున్నాయి.
మొదటిగా సంఘము అనగా నూతన నిబంధన
ప్రకారం ఏమిటో తెలుసుకుందాం.
ప్రకారం ఏమిటో తెలుసుకుందాం.
దానికి ముందు సంఘము అనగా ఏది కాదో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటిగా సంఘం అంటే ఒక బిల్డింగ్ లేదా భవనం కాదు.
ఒక ప్రదేశంలో ఇటుకల చేత సిమెంటు చేత
నిర్మించబడిన ఒక భవనాన్ని సంఘం అనడం
వాక్యానుసారం గా తప్పు.
నిర్మించబడిన ఒక భవనాన్ని సంఘం అనడం
వాక్యానుసారం గా తప్పు.
ఒక బిల్డింగ్ లో లేదా భవనంలో కూడుకోవడం
తప్పు కాదు కానీ ఆ భవనాన్ని సంఘం అనడం
బైబిల్ ప్రకారం తప్పు.
తప్పు కాదు కానీ ఆ భవనాన్ని సంఘం అనడం
బైబిల్ ప్రకారం తప్పు.
ఎందుకు తప్పో చెప్పడానికి నేను రెండు
ఉదాహరణలు మీతో పంచుకుంటాను.
ఉదాహరణలు మీతో పంచుకుంటాను.
అపోస్తలుల కార్యములు 8:3 వ వచనంలో,
సౌలయితే ఇంటింట జొచ్చి,పురుషులను స్త్రీలను
ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి
సంఘమును పాడుచేయుచుండెను
ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి
సంఘమును పాడుచేయుచుండెను
అని వ్రాయబడింది.
ఇక్కడ సంఘము అనగా ఒక భవనమే అయితే
సౌలు పాడు చేసింది
ఒక భవనాన్ని అని అర్థమవుతుంది.
సౌలు పాడు చేసింది
ఒక భవనాన్ని అని అర్థమవుతుంది.
అదే పుస్తకంలో అపోస్త 12:5వచనంలో పేతురు
చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే
అతనికొరకు అత్యాసక్తితో దేవునికి
ప్రార్థనచేయుచుండెను అని వ్రాయబడింది.
చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే
అతనికొరకు అత్యాసక్తితో దేవునికి
ప్రార్థనచేయుచుండెను అని వ్రాయబడింది.
ఒకవేళ సంఘము అనగా భవనం అయితే
ఇక్కడ పేతురు గురించి ప్రార్థిస్తున్నది
భవనమే కానీ ప్రజలు కాదనే అర్థం వస్తుంది.
ఇక్కడ పేతురు గురించి ప్రార్థిస్తున్నది
భవనమే కానీ ప్రజలు కాదనే అర్థం వస్తుంది.
అదేవిధంగా పౌలు కొరింథు సంఘానికి, గలతీ
సంఘానికి, థెస్సలొనీక సంఘానికి రాసిన
పత్రికలు, ఆ పట్టణాల్లో గల
సంఘానికి, థెస్సలొనీక సంఘానికి రాసిన
పత్రికలు, ఆ పట్టణాల్లో గల
భవనాలకు రాసినట్టు అవుతుంది.
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే
నూతన నిబంధన ప్రకారం సంఘము అనగా
భవనం కాదు.
భవనం కాదు.
ఎప్పుడైతే ఒక బిల్డింగ్ నీ మనం సంఘం
అంటామో, ఆ బిల్డింగ్ దేవుడు నివసించే
ప్రదేశంగా లేకపోతే
అంటామో, ఆ బిల్డింగ్ దేవుడు నివసించే
ప్రదేశంగా లేకపోతే
పవిత్రమైన ప్రదేశంగా మనం చూస్తాం.
అందుకే చాలామంది క్రైస్తవులు చర్చిభవనానికి
రాగానే పవిత్రులుగా, ఆ భవనం నుండి బైటికి
రాగానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు.
నోట్ :ఒక ప్రత్యేక భవనంలో కలిసి ఆరాధన,
ప్రార్థన చేయడం తప్పు కాదు కానీ ఆ భవనాన్ని
సంఘమనడం ముమ్మాటికీ తప్పే.
రాగానే పవిత్రులుగా, ఆ భవనం నుండి బైటికి
రాగానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు.
నోట్ :ఒక ప్రత్యేక భవనంలో కలిసి ఆరాధన,
ప్రార్థన చేయడం తప్పు కాదు కానీ ఆ భవనాన్ని
సంఘమనడం ముమ్మాటికీ తప్పే.
రెండవదిగా, సంఘమనగా ఆదివారం జరిపే
2-3 గంటల ఒక కార్యక్రమం కాదు.
2-3 గంటల ఒక కార్యక్రమం కాదు.
సంఘమంటే కార్యక్రమం అని నమ్ముతున్నందుననే
ఆదివారం ప్రత్యేక పాటలు, భారీ సంగీతం,
పెద్ద పెద్ద లైట్లు,( స్మోక్ ) పొగతో
ఆదివారం ప్రత్యేక పాటలు, భారీ సంగీతం,
పెద్ద పెద్ద లైట్లు,( స్మోక్ ) పొగతో
పిచ్చి పిచ్చి గంతులు ఇలా విచ్చలవిడిగా చేసేసి,
ఈ రోజు చర్చి బాగా జరిగింది అని చెప్పుకొని,
వచ్చే ఆదివారం చర్చిలో ఏమి చేయాలనీ
చర్చించడం మొదలెడతారు.
చర్చించడం మొదలెడతారు.
కార్యక్రమాలు ఉండకూడదని చెప్పడం లేదు,
కానీ ఆదివారం చేసే కార్యక్రమాలను సంఘం
అనడం సరియైనది కాదు.
అనడం సరియైనది కాదు.
మరి సంఘం అంటే ఏమిటి?
సంఘము అనే తెలుగు పదానికి గ్రీకు భాషలో
వాడబడిన పదం "Ekklesia".
వాడబడిన పదం "Ekklesia".
ఆంగ్లములోదీనిని "church"గా తర్జుమాచేశారు.
Ekklesia అన్న పదం, సమాజముగా
కూడుకొవడం లేదా సభగా హాజరవడం
గూర్చి చెప్పబడింది (అపోస్త 19:32,39,41).
కూడుకొవడం లేదా సభగా హాజరవడం
గూర్చి చెప్పబడింది (అపోస్త 19:32,39,41).
కానీ చాలా మట్టుకు ఈ పదం, యేసుక్రీస్తు
యందు విశ్వాసముంచిన ప్రజలనుద్దేశించి
నూతన నిబంధనలో ఉపయోగించబడింది.
యందు విశ్వాసముంచిన ప్రజలనుద్దేశించి
నూతన నిబంధనలో ఉపయోగించబడింది.
Ralph Earle గారు "word meanings
in the NT" అనే పుస్తకంలో -
in the NT" అనే పుస్తకంలో -
నూతన నిబంధనలో ekklesia అనే పదం
115సార్లు వాడితే, దానిలో 3 సార్లు
మత్తయి లో (18:16, 17), 24సార్లు
అపోస్తలుల కార్యములో,
115సార్లు వాడితే, దానిలో 3 సార్లు
మత్తయి లో (18:16, 17), 24సార్లు
అపోస్తలుల కార్యములో,
60 కి పైగా పౌలు గారి పత్రికల్లో వాడబడింది.
ప్రతిసారి విశ్వాసులనుద్దేశించి మరియు
స్థానిక సభలనుద్దేశించి వాడారు కానీ,
స్థానిక సభలనుద్దేశించి వాడారు కానీ,
ఒక భవనాన్ని ఉద్దేశించి వాడలేదని చెప్పారు.
సంఘమనగా, యేసుక్రీస్తునందు
విశ్వాసముంచిన ప్రజల సమూహం.
విశ్వాసముంచిన ప్రజల సమూహం.
వీరిని వివిధ రకాలుగా బైబిల్ ప్రస్తావిస్తుంది.
సంఘమనగా, క్రీస్తు శరీరమని 1కొరింథీ
12 వఅధ్యాయంలో,
12 వఅధ్యాయంలో,
ఎఫెసీ 1:22-23లో క్రీస్తు సంఘానికి శిరస్సని,
2కొరింథీ 6:8ప్రకారం అలాగే గలతీ 3:26-28
ప్రకారం సంఘము దేవుని కుటుంబమని,
ఎటువంటి తారతమ్యాలు లేని
ప్రకారం సంఘము దేవుని కుటుంబమని,
ఎటువంటి తారతమ్యాలు లేని
దేవుని కుమారులని బైబిల్ బోధిస్తుంది.
నిర్వచనం తప్పుగా అర్థం చేసుకుంటే,
నిజమైన సత్యం, నూతన మార్పులతో
అసత్యమైపోతుంది కాబట్టి
నిజమైన సత్యం, నూతన మార్పులతో
అసత్యమైపోతుంది కాబట్టి
జాగ్రత్తగా అర్థాలను గ్రహించవలసిన
అవసరతయున్నది.
ఈరోజు ఆ నూతన నిబంధన సంఘం యొక్క
కొన్ని లక్షణాలను మనం తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం.
కొన్ని లక్షణాలను మనం తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం.
అపోస్త 2:42 వీరు అపొస్తలుల బోధయందును
సహవాసమందును,రొట్టె విరుచుటయందును
ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
సహవాసమందును,రొట్టె విరుచుటయందును
ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
I.వాక్యానుసార బోధ
మొదటిగా నూతన నిబంధన సంఘము
అపొస్తలుల బోధ యందు ఎడతెగక
ఉన్నట్టుగా ఇక్కడ లూకా భక్తుడు రాసాడు.
అపొస్తలుల బోధ యందు ఎడతెగక
ఉన్నట్టుగా ఇక్కడ లూకా భక్తుడు రాసాడు.
ఎడతెగక అనే పదానికి బలమైన నిర్ణయం
అని అర్థం(Strong commitment ).
అని అర్థం(Strong commitment ).
యేసు పునరుత్తానుడైన పిదప శిష్యులు
యెరూషలేములో నిలబడి ధైర్యంగా సువార్త
బోధించిన తర్వాత ఏర్పడిన ఈ కొత్త సంఘము,
యెరూషలేములో నిలబడి ధైర్యంగా సువార్త
బోధించిన తర్వాత ఏర్పడిన ఈ కొత్త సంఘము,
మొదటగా వారి బోధయందు నిలిచియున్నది.
అపొస్తలలు ఏమి బోధించారు?
పాతనిబంధన సంగతులను, యేసు క్రీస్తు
బోధలను, ఆయన జీవితం,
మరణ పునరుత్తానములను గూర్చి
బోధించి ఉంటారని చెప్పగలం.
బోధలను, ఆయన జీవితం,
మరణ పునరుత్తానములను గూర్చి
బోధించి ఉంటారని చెప్పగలం.
అపొస్తలుల ఎడతెగక బోధించారు వాటిని
విశ్వాసులు దేవుని బోధయని నమ్మారు
కాబట్టే ఈ నూతన విశ్వాసులు ఎడతెగక
ఆ బోధనుండి నేర్చుకున్నారు,అంగీకరించారు.
విశ్వాసులు దేవుని బోధయని నమ్మారు
కాబట్టే ఈ నూతన విశ్వాసులు ఎడతెగక
ఆ బోధనుండి నేర్చుకున్నారు,అంగీకరించారు.
అన్వయింపు :
మరి ప్రస్తుతం మనకు, అపొస్తలుల బోధ అనగా బైబిల్ మొత్తం.
సంఘము కట్టబడేది మరియు నిలబడేది
సువార్త సందేశం మీద మరియు
బైబిల్ వాక్యం మీద అని తెలుసుకోవాలి.
సువార్త సందేశం మీద మరియు
బైబిల్ వాక్యం మీద అని తెలుసుకోవాలి.
నేటి దినాల్లో, స్వస్థతలపై, అద్భుతాలపై
పరిచర్యను సంఘాలను కడుతున్నారు.
పరిచర్యను సంఘాలను కడుతున్నారు.
వాక్యానుసారమైన, కల్తీ లేని సువార్త
కరువైపోతున్న కాలంలో మనమున్నాం.
కరువైపోతున్న కాలంలో మనమున్నాం.
దేవుని విమోచన ప్రణాళిక, మన పాపస్వభావం,
క్రీస్తు మరణ పునరుత్తానం పక్కన బెట్టి, దేవుడు
నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు,
నీకు ఉద్యోగం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు,
నీ అప్పులు తొలగిస్తాడు అంటూ నకిలీ
సువార్తతో సంఘాలను పక్కదోవ పట్టిస్తున్నారు.
నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు,
నీకు ఉద్యోగం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు,
నీ అప్పులు తొలగిస్తాడు అంటూ నకిలీ
సువార్తతో సంఘాలను పక్కదోవ పట్టిస్తున్నారు.
మరికొందరు, వాక్యాన్ని వక్రీకరించి, వారికిష్టమైన
రీతిలో, వారికి అనుకూలమైన పద్ధతిలో
బోధ చేస్తున్నారు.
రీతిలో, వారికి అనుకూలమైన పద్ధతిలో
బోధ చేస్తున్నారు.
వాక్యాన్ని లోతుగా ధ్యానించక, సరియైన విధంగా
వాక్యాన్ని విభజించక కేవలం కథలతో
కాలక్షేపం చేసి సంఘాన్ని
వాక్యాన్ని విభజించక కేవలం కథలతో
కాలక్షేపం చేసి సంఘాన్ని
ఓ కార్యక్రమంగా జరిపిస్తున్నారు.
వాక్యాన్ని సరిగా విభజించడం తెలీక వారికిష్టమైన
రీతిలో బోధ జరుగుతుంది.
ఇక్కడో వచనం ఎక్కడో వచనం కలిపి,
మధ్య మధ్యలో హల్లెలూయా చెబుతూ
30నిమిషాల్లో ప్రసంగం ముగించేస్తున్నారు.
మధ్య మధ్యలో హల్లెలూయా చెబుతూ
30నిమిషాల్లో ప్రసంగం ముగించేస్తున్నారు.
సంఘమును వాక్యంలో పోషించాలంటే పుస్తకం
వెంబడి పుస్తకం, క్రమంగా బోధ చేయాలని అంటారు.
వెంబడి పుస్తకం, క్రమంగా బోధ చేయాలని అంటారు.
దానినే expository preaching అని
నిర్వచిస్తాము.
నిర్వచిస్తాము.
గ్రంథకర్త యొక్క భాష, అప్పటి చారిత్రక నేపథ్యం,
సందర్బం ఇవన్నీ సరిగా అర్థవివరణ చేసి చెప్పే
ప్రసంగీకులు చాలా తక్కువ.
సందర్బం ఇవన్నీ సరిగా అర్థవివరణ చేసి చెప్పే
ప్రసంగీకులు చాలా తక్కువ.
సంఘముకూడా పాస్టర్ గారి బోధమీదనే
ఆధారపడి ఆయన చెప్పిందే సత్యమని,
గుడ్డిగా అనుసరిస్తున్నారు.
ఆధారపడి ఆయన చెప్పిందే సత్యమని,
గుడ్డిగా అనుసరిస్తున్నారు.
ఆనాడు పౌలుగారి ప్రసంగాలనే పరీక్షించిన
విశ్వాసులు, కాని నేడు పాస్టర్ గారి ప్రసంగాలను
తుచ తప్పక అంగీకరిస్తున్న విశ్వాసులు.
విశ్వాసులు, కాని నేడు పాస్టర్ గారి ప్రసంగాలను
తుచ తప్పక అంగీకరిస్తున్న విశ్వాసులు.
ఎందుకు అంగీకరిస్తున్నారు తెలుసా??
వారు స్వంతంగా వాక్యం ధ్యానించరు కాబట్టి.
ఆదివారం మాత్రమే బైబిల్ తెరుస్తారు కాబట్టి.
క్యాలెండర్లో వచనం చదివి దేవునికి
దగ్గరైపోయామనే భ్రమలో
బతుకుతున్నారు కాబట్టి.
దగ్గరైపోయామనే భ్రమలో
బతుకుతున్నారు కాబట్టి.
సంఘములో వాక్యానుసారమైన బోధ లేకపోతే,
విశ్వాసులు వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోకపోతే
ఆ సంఘము అనారోగ్య సంఘమే.
డాక్టర్ గారు మందుల చీటీలో రాసిన మందులు
వేసుకుంటే వ్యాధి నయమవుతుంది,
కేవలం చీటీని పట్టుకుంటే కాదు
వేసుకుంటే వ్యాధి నయమవుతుంది,
కేవలం చీటీని పట్టుకుంటే కాదు
అలాగే బైబిల్ వాక్యాన్ని ధ్యానించి,సరిగా విభజించి,
వివరించి, అన్వయించుకుంటేనే సంఘం
ఆరోగ్యకరమైన సంఘముగా
దేవుని మహిమకై పనిచేస్తుంది,
ఆరోగ్యకరమైన సంఘముగా
దేవుని మహిమకై పనిచేస్తుంది,
కేవలం బైబిల్ పట్టుకుంటే కాదు.
II. సహవాసం :
ఆదిమ విశ్వాసులు సహవాసమందు ఎడతెగక
నిలిచియున్నారు.
నిలిచియున్నారు.
అనగా సహోదర ప్రేమ సంబంధమును వారు
కలిగియున్నారు అని ఆర్థం.
కలిగియున్నారు అని ఆర్థం.
యెరూషలేములో రక్షించబడిన ఈ విశ్వాస
సమూహం, ఒక కొత్త బంధాన్ని క్రీస్తు ద్వారా
కలిగియున్నారు.
సమూహం, ఒక కొత్త బంధాన్ని క్రీస్తు ద్వారా
కలిగియున్నారు.
ఈ ప్రేమ ఎలా ఉందంటే, వారు తమకు
కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని,
ఎవరికి అవసరత ఉంటే వారికి పంచిపెట్టారు.
కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని,
ఎవరికి అవసరత ఉంటే వారికి పంచిపెట్టారు.
ఇక్కడ మీకున్న మొత్తం ఆస్తి అమ్మి సంఘానికి
ఇవ్వండి అనే ఆర్థం వచ్చినట్టు లూకా వ్రాయలేదు.
ఇవ్వండి అనే ఆర్థం వచ్చినట్టు లూకా వ్రాయలేదు.
జాన్ స్టాట్ గారు, అవసరంలో ఉన్నవారి కొరకై
అని దానిని వివరిస్తారు.
అని దానిని వివరిస్తారు.
అన్వయింపు :
మనం ఆర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే,
సంఘము అనగా ప్రతి ఆదివారం
praise the lord అని చెప్పుకునే
ఓ ప్రదేశం కాదు.
praise the lord అని చెప్పుకునే
ఓ ప్రదేశం కాదు.
విశ్వాసులు దేవుని ప్రేమను ఇతరులతో
వివిధ రకాలుగా పంచుకునే సమాజమే
సంఘము.
వివిధ రకాలుగా పంచుకునే సమాజమే
సంఘము.
ఒక కుటుంబంలో గల సభ్యుల మధ్య ప్రేమలే
ఉండాలి.
ఉండాలి.
ఈ మధ్య వార్తలు చూస్తే బాధేస్తుంది.
తల్లిదండ్రులను చంపిన కొడుకు, కొడుకుని
కడతేర్చిన తండ్రి అంటూ ఇలా కుటుంబం
అనే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు.
కడతేర్చిన తండ్రి అంటూ ఇలా కుటుంబం
అనే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు.
కాని ప్రేమలేని కుటుంబం, కుటుంబమే కాదు.
బైబిల్, సంఘమును దేవుని కుటుంబముగా,
క్రీస్తును కుటుంబానికి శిరస్సుగా నిర్వచించింది.
ఇదే బైబిల్ ఇతరులను నిన్ను నీవు ప్రేమించు
రీతిగా,ప్రేమించమని అర్థించలేదు,
ఆజ్ఞాపించింది.
రీతిగా,ప్రేమించమని అర్థించలేదు,
ఆజ్ఞాపించింది.
నేటి సంఘాలు ప్రోగ్రాం ఓరియెంటెడ్
అయిపోయినాయి.
అయిపోయినాయి.
ఆదివారం ఆరాధన, సోమవారం ప్రార్థన,
బుధవారం ఉపవాసం,
బుధవారం ఉపవాసం,
శనివారం బైబిల్ స్టడీ.అంతే. వాటికి వచ్చామా,
వెళ్ళామా అనే విధంగా జరిగిపోతుంది.
వెళ్ళామా అనే విధంగా జరిగిపోతుంది.
పాస్టర్ గారు ఏమనుకుంటారో, ఇతరులు
ఏమనుకుంటారో అని వస్తాం.
వీటికి రావద్దని నేను చెప్పట్లేదు కాని,సంఘములో
గల సోదరులను పట్టించుకోక, వారితో
ప్రేమ సంబంధం కలిగిలేక
గల సోదరులను పట్టించుకోక, వారితో
ప్రేమ సంబంధం కలిగిలేక
పైపైన ఆత్మీయత చూపించే సంఘము
అనారోగ్య సంఘమే అని చెబుతున్నాను.
అనారోగ్య సంఘమే అని చెబుతున్నాను.
ఒకరిపట్ల ఒకరికి ప్రేమలేని సంఘము ఒకరకంగా
క్రీస్తు లేని సంఘము అనవచ్చేమో.
ప్రేమ చూపించే విషయాలు.
1. ప్రోత్సాహం (హెబ్రీ 10:24-25)
కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా
కూడుట మానక, ఒకనినొకడు
హెచ్చరించుచు,ఆ దినము సమీపించుట
మీరు చూచినకొలది మరి యెక్కువగా
ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును
కూడుట మానక, ఒకనినొకడు
హెచ్చరించుచు,ఆ దినము సమీపించుట
మీరు చూచినకొలది మరి యెక్కువగా
ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును
ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
ఇంగ్లిష్ భాషలో " encourage one another "
అని చెప్పవచ్చు.
అని చెప్పవచ్చు.
ఇతరులను సత్కార్యములు చేయడానికి
పురికొల్పాలి,
పురికొల్పాలి,
వారు పాపము చేస్తే సరి చేయాలి,
విశ్వాసములో బలహీనులైతే
విశ్వాసములో బలహీనులైతే
ప్రోత్సాహకరమైన మాటలు, ప్రార్థన చేయాలి.
ఒకవేళ వారి అవసరతను బట్టి ఆర్థికపరమైన
సహాయం కూడా అందించాలి.
సహాయం కూడా అందించాలి.
ఆతిథ్యమియ్య మరువకుడి అని పౌలు
బోధిస్తున్నాడు.
బోధిస్తున్నాడు.
సంఘకాపరికి ఆతిథ్యమివ్వడం చేస్తాం కాని,
సంఘసభ్యులకు ఆతిథ్యమిచ్చి,వారితో
సహవాసం చేసి, ప్రార్థించే సంఘాలు కనబడట్లేదు.
సంఘసభ్యులకు ఆతిథ్యమిచ్చి,వారితో
సహవాసం చేసి, ప్రార్థించే సంఘాలు కనబడట్లేదు.
2. ప్రార్ధన చేయడం
సంఘమును ప్రేమిస్తే, సంఘముకై ప్రార్థిస్తాం.
నీ తోటి సోదర సోదరి కొరకు, దేవునియొద్ద
ప్రార్థించడం, వారిపట్ల నీకున్న
ప్రేమను చూపిస్తుంది.
ప్రార్థించడం, వారిపట్ల నీకున్న
ప్రేమను చూపిస్తుంది.
నేడు, సంఘములో సభ్యులెవరో
తెలియని పరిస్థితి.
తెలియని పరిస్థితి.
Praise the Lord ప్రేమలు ఎక్కువైపోయాయి.
పేరుపేరునా సంఘ సభ్యులకొరకై వారి ఆత్మీయ
మరియు శారీరక అవసరతలకై ప్రార్థించే
సంఘాలు కరువైపోయాయి.
మరియు శారీరక అవసరతలకై ప్రార్థించే
సంఘాలు కరువైపోయాయి.
మొదటిగా కాపరే మంద గురించి
ప్రార్థించలేకపోతున్నాడు.
ప్రార్థించలేకపోతున్నాడు.
అపోస్త 2:42లో ఆది క్రైస్తవులు ప్రార్థనలో
ఎడతెగక ఉన్నారని కూడా మనం చూస్తాం.
ఎడతెగక ఉన్నారని కూడా మనం చూస్తాం.
ఆదిమ విశ్వాసులు శ్రమలొచ్చినపుడు
ప్రార్థన చేశారు (Acts 4:24), నాయకులను
నియమించినపుడు ప్రార్ధన చేశారు( 14:23).
ప్రార్థన చేశారు (Acts 4:24), నాయకులను
నియమించినపుడు ప్రార్ధన చేశారు( 14:23).
అపొస్తలుల కార్యముల పుస్తకంలో
దాదాపు 31 సార్లు, పౌలు పత్రికలలో 42సార్లు
ప్రార్థన గూర్చిన ప్రస్తావన ఉన్నట్లు చూస్తాం.
దాదాపు 31 సార్లు, పౌలు పత్రికలలో 42సార్లు
ప్రార్థన గూర్చిన ప్రస్తావన ఉన్నట్లు చూస్తాం.
ఒకరికొరకు ఒకరు ప్రార్థించని సంఘము
ప్రేమలేని సంఘమే, ప్రేమలేని సంఘము
క్రీస్తు లేని సంఘమే.
ప్రేమలేని సంఘమే, ప్రేమలేని సంఘము
క్రీస్తు లేని సంఘమే.
3. కష్టాల్లో బాధలో సహాయం చేయడం.
ప్రేమ అనేది ఒక క్రియ. ప్రేమిస్తున్నాని చెప్పి
ఒట్టి కబుర్లు చెబితే అది ప్రేమ కాదు.
ఒట్టి కబుర్లు చెబితే అది ప్రేమ కాదు.
ఆ ప్రేమను వ్యక్తపరిచే పనులు చేసినప్పుడే
ఇతరులు ఆ ప్రేమను అనుభవించగలరు.
మనం మన కుటుంబ సభ్యులను ఎందుకు
ప్రేమిస్తామంటే, ఒకటే రక్తం పంచుకొని
పుట్టాము కాబట్టి. అందుకే వారికేమైన
జరిగితే తట్టుకోలేం.
ప్రేమిస్తామంటే, ఒకటే రక్తం పంచుకొని
పుట్టాము కాబట్టి. అందుకే వారికేమైన
జరిగితే తట్టుకోలేం.
సంఘము దేవుని కుటుంబం కావున,
క్రీస్తు రక్తము చిందించి సంఘమును
రక్షించాడు కావున, మనం మన
కుటుంబ సభ్యుల వలెనే, సంఘ
సభ్యులను ప్రేమించబద్ధులమైయున్నాం.
క్రీస్తు రక్తము చిందించి సంఘమును
రక్షించాడు కావున, మనం మన
కుటుంబ సభ్యుల వలెనే, సంఘ
సభ్యులను ప్రేమించబద్ధులమైయున్నాం.
ప్రేమించడం అంటే, డబ్బును, సమయాన్ని,
నీ శక్తిని వెచ్చించాలి కాబట్టే,
నీ శక్తిని వెచ్చించాలి కాబట్టే,
ఆ పని చేయడానికి సంఘ సభ్యులు
నిర్లక్ష్యం చేస్తారు.
నిర్లక్ష్యం చేస్తారు.
యోహాను 3:16 మనందరికి తెలిసిందే కాని,
1యోహాను 3:16 చూస్తే, ఆయన మన నిమిత్తము
తన ప్రాణముపెట్టెను గనుక
1యోహాను 3:16 చూస్తే, ఆయన మన నిమిత్తము
తన ప్రాణముపెట్టెను గనుక
దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము,
మనము కూడ సహోదరుల నిమిత్తము
మన ప్రాణములను పెట్ట బద్ధులమై
యున్నాము అని వ్రాయబడింది.
మన ప్రాణములను పెట్ట బద్ధులమై
యున్నాము అని వ్రాయబడింది.
దేవుని ప్రేమను పొందుకొని, నేను రక్షించబడ్డాను
అది చాలు.
అది చాలు.
సంఘ కార్యక్రమాలకి హాజరవుతాను,
దశమభాగాలేస్తాను, పాటలు పాడతాను
ప్రార్థన చేస్తాను ఇది చాలు.
దశమభాగాలేస్తాను, పాటలు పాడతాను
ప్రార్థన చేస్తాను ఇది చాలు.
నేను నా కుటుంబం నా ఉద్యోగం నా జీవితం
అనుకుని బ్రతికే వాడు వాక్యానుసారమైన
క్రైస్తవుడు కాదు.
అనుకుని బ్రతికే వాడు వాక్యానుసారమైన
క్రైస్తవుడు కాదు.
ఇతరుల ఇరుకుల్లో ఇబ్బందుల్లో నిలబడి
సహాయం చేయువాడు ప్రేమగల క్రైస్తవుడు.
సహాయం చేయువాడు ప్రేమగల క్రైస్తవుడు.
అటువంటి సంఘమును బట్టి దేవుడు ఆనందిస్తాడు.
మిగతా విషయాల గూర్చి తదుపరి ఆర్టికల్ పార్ట్ II లో వివరిస్తాను.

సంఘము యొక్క నిజమైన అర్ధము.. సంఘంలో ఉన్నవాడిగా నా బాధ్యత... అసలు క్రైస్తవు డిగా నాలో కనిపించవలసిన గుణాలు గుర్తుకొచ్చాయి.ఈ బ్లాగ్ రీడర్షిప్ పెరగాలని, అనేకులు ఆ content ద్వారా ఆత్మీయంగా పురికొల్పబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ReplyDelete