నేటి దినాల్లో రోజురోజుకి దిగజారిపోతున్న
వ్యవస్థలలో ఒకటి కుటుంబ వ్యవస్థ.
చిన్ననాటినుండే పిల్లలు తల్లిదండ్రుల
మాట వినకపోవడం,
తల్లిదండ్రులు పిల్లలను పెంచే విషయంలో
జాగ్రత్త పడకపోవడం వలన ఆ పిల్లలు పెద్దవారై
ఎన్నో మానసిక రుగ్మతలను పొందుకుంటున్నారు.
తల్లిదండ్రులు పిల్లల పెంపకం అనేది,
తనకు తానుగా వచ్చే ప్రక్రియగా ఎంచి,
సరియైన విధములో నేర్చుకోనందున
తప్పుడు విధంగా పిల్లలను పెంచుతుంటారు.
కాని పెంపకం అనేది ప్రతి తల్లితండ్రి
నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ అని తెల్సుకోవాలి.
పుస్తకాలు చదవడం,పెద్దవారి సలహాలు
తీసుకోవడం,
తీసుకోవడం,
పిల్లల మానసిక శారీరక సంగతులను
అర్థం చేసుకుంటూ పెంచడం అనేది
చాలా ప్రాముఖ్యం.
ఈ చిన్న ఆర్టికల్లో పిల్లల పెంపకంను గూర్చి
కొన్ని విషయాలు పంచుకుంటాను.
ఈ విషయాలు తల్లిదండ్రులుగా పాటిస్తూ
నేర్చుకుంటూ, మీతో కూడా పంచుకోవాలని
ఇష్టపడుతున్నాను.
AFFECTION:
అనగా తెలుగులో వాత్సల్యం లేదా
అనురాగం చూపడం అని అర్థం.
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల
వాత్సల్యం చూపాల్సిన అవసరమున్నది.
నేటి తరం తల్లిదండ్రులు వారి పిల్లలతో
వారి ప్రేమను చూపించే కార్యాలు చేయడం
నిర్లక్ష్యం చేస్తున్నారు.
మన ప్రేమను వారికి వ్యక్తపరిచే చిన్న చిన్న
సందర్భాలను నిర్లక్ష్యం చేయడం వలన
వారి భవిష్యత్తును ఒక రకంగా ఫలరహితముగా
చేస్తున్నాం.
2010 లో డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో
నిర్వహించిన సర్వేలో " తల్లిచే చిన్నప్పటి నుండి
ఈ వాత్సల్యం లేదా ప్రేమ పొందుకున్నవాళ్లు
సంతోషంగా, తక్కువ కృంగిపోయే పెద్దవాళ్ళగా
ఎదిగారని తెలిసింది.
సంతోషంగా, తక్కువ కృంగిపోయే పెద్దవాళ్ళగా
ఎదిగారని తెలిసింది.
ఇక్కడ అనురాగం చూపడం అంటే,
చిన్నప్పటినుండే వారిని దగ్గర తీసుకొని,
వారికి మీ ప్రేమను చూపించడం.
చిన్నప్పటినుండే వారిని దగ్గర తీసుకొని,
వారికి మీ ప్రేమను చూపించడం.
ఇది బిడ్డ పుట్టిననాటినుండే తల్లి యొక్క స్పర్శతో
మొదలవుతుంది.
కొందరు తండ్రులు మరీ విచిత్రంగా
తమ పిల్లల్ని కనీసం ఎత్తుకోరు.
పిల్లల్ని అపుడపుడు కౌగిలించుకోవడం మంచిది.
నేను బయట నుంచి రాగానే నా పిల్లలు వచ్చి
గట్టిగా వాటేసుకుంటారు. ఆ అలవాటు
మేము నేర్పాము
మేము నేర్పాము
కాబట్టి వారు కూడా అలా మమ్మల్ని
కౌగిలించుకుంటారు.
కౌగిలించుకుంటారు.
వారు మంచిపని చేసినపుడు అభినందించి
ముద్దు పెట్టడం కూడా మంచిది.
ఇలా చేయడంవలన వారు మీ ప్రేమను
ఇలా చేయడంవలన వారు మీ ప్రేమను
అనుభవిస్తారు.
వారికి దెబ్బ తగిలినప్పుడు మందు రాయడమే
కాకుండా, వారిని దగ్గరికి తీసుకొని ఓదార్చడం
చాలా ప్రాముఖ్యం.
ఇవన్నీ వారి మానసికఆరోగ్యానికి
ఎంతో దోహదం చేస్తాయని
పిల్లల వైద్యులు కూడా చెప్తారు.
కొంతమంది తండ్రులు పిల్లలతో దూరంగా ఉండి
అంతా తల్లే చూసుకుంటుంది అని వదిలేస్తారు,
ఇదికూడా మంచిదికాదు.
BONDING : బంధము
పిల్లలతో బంధాన్నిఏర్పరుచుకొనుట.
దానికంటే ముందు భార్యభర్తలుగా మనం
ఒకే బంధంతో ఉన్నామని పిల్లలు చూడాలి.
మనం కొట్లాడుకుంటు,తిట్టు కుంటూ
పిల్లల్ని మంచిగా పెంచడం అనేది జరగదు.
భార్య భర్తలు పిల్లల పట్ల ప్రేమ కలిగుండడం
అనేది భార్య భర్త పట్ల భర్త భార్య పట్ల కలిగే
ప్రేమ పై ఆధారపడి ఉంటుంది.
పిల్లలతో తగినంత సమయం గడుపుట ద్వారా
మన మనం పిల్లలతో బంధాన్ని పెంచుకోగలం.
మనమెంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు,
ఎంత సమయం భార్యతో కుటుంబంతో
గడుపుతున్నాం అనేదే ప్రాముఖ్యం.
ఈ రోజుల్లో మన బిజీ జీవితంలో పడి పిల్లలతో
సరియైన బంధాన్ని కలిగి ఉండకపోవడం
విచారకరం.
విచారకరం.
ఇది కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి
మొదలుపెట్టాలి.
మొదలుపెట్టాలి.
ఈ రోజు స్కూల్ లో ఏం జరిగింది?
ఏం నేర్చుకున్నారు?
ఇలాంటి ప్రశ్నలు మనం అడగాలి.
సాయంకాలం వారితో కలిసి ఆడుకోవాలి.
వారిని అప్పుడప్పుడూ సెలవుల్లో
బయటికి తీసుకెళ్లాలి.
బయటికి తీసుకెళ్లాలి.
మీకో విషయం చెప్పాలా,
తల్లిదండ్రులతో చిన్నప్పట్నుంచి
ఈ బాండింగ్ లేని పిల్లలు పెద్దయ్యాక
చాలా మానసికమైన ఇబ్బందులకు
గురవుతుంటారు.
గురవుతుంటారు.
CHRIST'S WORD : దేవుని వాక్యం
కుటుంబ వ్యవస్థకు ఆధారం దేవుడే.
కుటుంబాలు ఏ విధంగా జీవించాలని
నియమించింది కూడా దేవుడే.
తల్లిదండ్రులుగా ఏ విధంగా పిల్లల పట్ల
ప్రవర్తించాలి అనేది కూడా
మనం నేర్చుకునేది దేవుని నుండే.
మొదటిగా దేవుని యొక్క కుటుంబప్రణాళిక
అర్థం చేసుకోవడంలో మనం ఓడిపోవడం వలన,
మన కుటుంబాలు నిర్వీర్యమవుతున్నాయి .
ద్వితీయోపదేశకాండము 6:6-7
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు
నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి,
నీ యింట కూర్చుండునప్పుడును
త్రోవను నడుచునప్పుడును
పండుకొనునప్పుడును లేచునప్పుడును
వాటినిగూర్చి మాటలాడవలెను;
సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
ఎంత మంది తల్లిదండ్రులు
ఈ వాక్యాన్ని పాటిస్తున్నారు?
ఎఫెసీయులకు 6:4
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక
ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను
వారిని పెంచుడి.
ఇంకా కొన్ని వచనాలు గుర్తు చేయాలని ఉన్నను,
ఇప్పటికి ఈ రెండు వచనాలు చాలనిపిస్తుంది.
మనం దేవుని మాటలకు లోబడి విధేయతతో
పిల్లల్ని వాక్యానుసారంగా పెంచకపోవడమే,
మన పిల్లలు క్రమశిక్షణ లేకుండా
పెరగకపోవడానికి కారణం
అనే సత్యాన్ని అంగీకరించాల్సిందే.
దేవున్ని విడిచి, ఆయన వాక్యం ఆజ్ఞలు మరిచి
మనం ఏమి సాధించలేము.
నీ కుటుంబం దేవునికి ఇష్టంగా ఉండాలని
ఆశ పడుతున్నావా?
అయితే బైబిల్ గ్రంథమును ధ్యానిస్తూ,
వాక్యానుసారమైన ఆజ్ఞలు పాటిస్తూ
నీ కుటుంబాన్ని కట్టుకో.
క్రీస్తు కేందీకృత కుటుంబం కావాలని
ఇష్ట పడుతున్నట్లైతే,
క్రీస్తును కేంద్రంగా పెట్టుకోవడం ద్వారానే
అది సాధ్యం అని మర్చిపోకూడదు.
DISCIPLINE : క్రమశిక్షణ
మనం చిన్నప్పుడు, బెత్తాలు విరిగేవి,
గోడకుర్చీలు వేసేది,
నడుములు ఎర్రగయ్యేవి.
ఎందుకు? మన తల్లిదండ్రులు క్రమశిక్షణలో
పెంచేవారు.
కాని ఇప్పుడు, పిల్లల్ని కొట్టొద్దు అనే
సిద్ధాంతానికి వచ్చాం.మంచిదే పిల్లల్ని కొట్టొద్దు.
అది కరెక్టే కానీ వారు తప్పు చేసినప్పుడు
సరిచేయడానికి సరైన పద్ధతిలో శిక్షించడం
వారికి మంచిది.
చాలామంది ప్రేమను క్రమశిక్షణను
వేరుగా చేసి చూస్తారు
కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే
మనం పిల్లల్ని ప్రేమిస్తున్నాము కాబట్టే
వారిని క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షిస్తున్నాము.
బైబిల్ గ్రంధం ఈ విధంగా సెలవిస్తుంది.
"బాలుని హృదయంలో మూఢత్వము
స్వాభావికముగా పుట్టును,
శిక్షా దండన దానిని వానిలో నుండి తొలి వేయను".
"బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి,
కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును".
అలాగని ప్రతిసారీ కొట్టాలని నా అర్థం కాదు గాని,
కొన్నిసార్లు వారి తప్పులు, అవిధేయత
సరి చేయడానికి చిన్నగా మెల్లగా కొట్టడంలో తప్పులేదు.
ఈ క్రమశిక్షణలో కూడా కొన్ని విషయాలు
మనం పాటించాలి.
తండ్రి వారిని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు
తల్లి అడ్డుగా రాకూడదు.
ఒకవేళ వస్తే వారికి అర్థమైపోతుంది,
ఓహో తండ్రి క్రమశిక్షణలో
పెడితే తల్లి మాకు రక్షణ అని.
అదేవిధంగా తల్లి క్రమశిక్షణలో పెట్టినప్పుడు
తండ్రి కూడా రాకూడదు.
అన్ని వయసుల వారికి ఒకే రకమైన క్రమశిక్షణ
కూడా మంచిది కాదు.
కొందరు తల్లిదండ్రులు విపరీతమైన కోపంతో
కొడతా ఉంటారు.
అలా చేయడం వలన పిల్లలు మనకు భయపడి
దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు.
మన లక్ష్యం ఏంటంటే మనం ఇచ్చే శిక్షణ ద్వారా
మన పిల్లల్ని మనం పొందు కోవాలి గానీ
వారిని దూరం చేసుకోవడం కాదు.
క్రమశిక్షణ చేసినప్పుడు దాని తర్వాత
తిరిగి వాళ్లను దగ్గరికి తీసుకోవాలి
ప్రేమగా వారికి చెప్పాలి.
ఇంకా చాలా విషయాలు ఉన్నను,
మనకు గుర్తుండే విధంగా 4 సంగతులను
చెప్పే ప్రయత్నం చేశాను.
మన పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు,
వారిని దేవునికిష్టంగా పెంచడం మన బాధ్యత.
ఈ బాధ్యతను మనం అలక్ష్యం
చేయకుందుము గాక.
Comments
Post a Comment