మొదటగా గర్భ స్రావం అనగా నిర్వచనం తెలుసుకుందాం.
ఉద్దేశపూర్వకంగా, గర్భములో ఉన్న పిండము లేదా
శిశువు జీవితాన్ని అర్థాంతరంగా ముగించే ప్రక్రియను
ఆంగ్ల భాషలో అబార్షన్ అని ,
తెలుగులో గర్భస్రావం అని అంటారు.
తమకు తాముగా కొన్ని వైద్యసంబంధ కారణాల వలన
జరిగే గర్భస్రావం గురించి ఇక్కడ చర్చించట్లేదు కానీ,
వ్యక్తిగతంగా లేదా ఇతరుల ప్రోద్భలంతో, ఉద్దేశ్యపూర్వకంగా
వివిధ రకాలైన పద్ధతుల ద్వారా గర్భస్రావం చేయించుకునే
విషయమే ఇక్కడ చర్చిద్దాం.
గర్భస్రావం చేయించుకోడానికి గల ప్రాథమిక కారణాలు.
1. పెళ్ళికి ముందే లైంగిక సంబంధం వలన కలిగిన
సంతానమును వదిలించుకోవాలని,
తద్వారా సమాజం నుండి ఎదురయ్యే
వివక్ష నుండి తప్పించుకోవాలని.
2. పెళ్లి తర్వాత అక్రమ సంబంధం వలన కలిగిన
సంతానం వద్దనుకున్నపుడు.
3. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిసినపుడు మరియు
రెండో సారి లేదా మూడో సారి ఆడ పిల్ల పుట్టినపుడు.
4. పుట్టబోయే బిడ్డ ఎదో అంగవైకల్యం కలిగున్నదని
తెలుసుకున్నప్పుడు.
5. గర్భవతియైన తల్లి ప్రాణానికి సమస్య
ఉత్పన్నమవుతుందనుకున్నపుడు.
కారణాలేవైనా మొదటిగా తెలుసుకోవాల్సిన
విషయం ఏమిటంటే, గర్భములో ఉన్న పిండము
లేదా శిశువు ఒక జీవము కలిగిన మనిషి
అనే సత్యం అక్షరాలా సత్యమైయున్నది.
గర్భ ధారణ జరిగిన సమయంలోనే
మనిషి యొక్క జీవితం ఆరంభమౌతుంది.
ఫలదీకరణం చెందిన ఆ నూతన పిండములో
మనిషికి గల జీవం మొదలవుతుందని
ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
వయసులో చాలా చిన్నదైనా, పరిమాణంలో అల్పమైనదైనా
ఆ శిశువు ఒక జీవము గల్గిన వ్యక్తి అని మర్చిపోవద్దు.
ఆ జీవమునిచ్చేది దేవుడని బైబిల్ గ్రంథం బోధిస్తుంది.
కీర్తనలు 139:13 - నా అంతరింద్రియములను
నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు
నన్ను నిర్మించిన వాడవు నీవే.
యోబు 31:15 - గర్భమున నన్ను పుట్టించినవాడు....
గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే (దేవుడు) గదా
దేవుడే మనిషిని గర్భములో పుట్టించువాడు,
గర్భములో పెంచు వాడు, లోకంలోకి తీసుకునివచ్చి
జీవింపచేసేవాడు అని వాక్యం మనకు వివరిస్తుంది.
అబార్షన్, దేవుడిచ్చిన జీవము కలిగిన
ఒక వ్యక్తిని చంపడమే అని తెలుసుకోవాలి.
ఒకాయన ఈ విధంగా అన్నాడు
" గర్భస్రావం అనేది కేవలం గర్భములో గల
పిండమును చంపడమే కాక దేవుని కార్యమును కూడా
నశింపచేసే ప్రక్రియ".
పెళ్లికి ముందే లైంగిక సంబంధం బైబిల్ విరుద్ధం.
నీవు తప్పు చేసి, ఆ పిదప గర్భస్రావం చేయించుకొని
మరో తప్పు ( హత్య) చేయడం, వాక్యానుసారంగా
ఆమోదయోగ్యం కాదు.
నీ తప్పుకు బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి ?
ఎవరో ఎదో అనుకుంటారని ఒక హత్య చేయడానికి ముందు,
దేవుడు గర్భస్రావమును ప్రోత్సాహపరచడు
అనే విషయం తెలుసుకోవడం మంచిది.
గర్భములోని శిశువు ఆడా లేక మగా అని
అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకోవడం
మన దేశములో చట్ట రీత్యానేరం.
పుట్టబోయేది ఆడ పిల్లని తెలిసికొని
గర్భస్రావం చేయించుకోవడం మరో నేరం.
ఆడపిల్లను కనడం పాపమైపోయింది మన దేశంలో.
పిల్లలు దేవుడిచ్చు బహుమానమని వాక్యం చెబుతుంది.
మగపిల్లలు మాత్రమే అని చెప్పట్లేదు.
దేవునికి ఆడ మగా అనే వ్యత్యాసం లేదు.
క్రైస్తవులకు ఈ విధమైన ఆలోచన కలగడం కూడా
పాపమే అని చెప్పడానికి నేను వెనుకాడట్లేదు.
మరికొందరు తల్లిదండ్రులు పుట్టబోయే బిడ్డకి
అంగవైకల్యం ఉందని అబార్షన్ చేయడాన్ని
సమర్థించుకుంటారు.
అంగవైకల్యం లేదా మరేదో సమస్య ఉన్నంత మాత్రాన
గర్భంలో ఉన్న బిడ్డ ఒక వ్యక్తి కాకపోడు కదా.
ఒక పండు చెడిపోయినా దాన్ని పండు అనే అంటారు.
ఒక వ్యక్తి తన యవ్వన ప్రాయములో లేదా
వృద్ధాప్యములో ఏదో ప్రమాదానికి గురై అవిటి వాడైతే
ఆ వ్యక్తిని, పనికి రాడని చంపేయము కదా.
అవిటితనం లేదా అంగవైకల్యం ద్వారా
ఒక వ్యక్తి యొక్క విలువ మరియు స్వభావం మారవు
అని అర్థం చేసుకోవాలి.
గర్భవతియైన తల్లి ప్రాణానికి సమస్య
ఉత్పన్నమవుతుంది కావున అబార్షన్ చేశాము
అని కొందరంటుంటారు.
గర్భముతో ఉన్న తల్లికి ప్రాణాంతకమైన వ్యాధులు
కలిగి అబార్షన్ చేయాల్సి రావడం
చాలా అరుదుగా జరిగే విషయం.
గర్భాశయ కేన్సర్, గర్భాశయానికి బైట పిండం పెరగడం
మొదలైన సమస్యలొచ్చినపుడు
తల్లి ప్రాణం కాపాడుట కొరకు
ఆ పిండాన్ని తీసేయాల్సి రావచ్చు.
ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రాణం కాపాడడం తప్పదు
కావున వైద్యుల సలహాలతో అబార్షన్ చేసుకోవచ్చు.
ఇక్కడ అబార్షన్ యొక్క లక్ష్యం, తల్లి ప్రాణం కాపాడడమే కానీ,
పుట్టని బిడ్డని చంపడం కాదని గమనించాలి.
కాని అబార్షన్ చేయించుకోవాలనే చెడ్డ ఆలోచనను
ఏదో ఒక వ్యాధికి ముడిపెట్టి జరిగేలా చేయడం
చాలా తప్పు అని గ్రహించాలి.
దేవుడిచ్చిన జీవితం చాలా విలువైనది.
గర్భములో ఉన్నవారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా
అందరూ దేవునిచే చేయబడిన వారు.
ఎవరిని చంపినా దేవుని దృష్టిలో నరహత్య పాపమే.
అయితే, దేవుని ఎదుట చేసిన తప్పు ఒప్పుకున్నట్లైతే
తప్పకుండా క్షమిస్తాడు కావున,
గర్భస్రావం చేయించుకొని తప్పు చేశామని బాధపడే వారికి
దేవుని క్షమాపణ ఒక శుభవార్త.
ప్రభువైన యేసు క్రీస్తు మన పాపములకై మరణించాడు.
ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో,
ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక
మన పాపములను క్షమించి మనలను
పవిత్రులనుగా చేస్తాడు ( 1యోహాను 1:9).
ప్రియ క్రైస్తవ సహోదర సహోదరీమణులారా,
దయచేసి గర్భస్రావమనే హత్య చేయకండి.
లోకానుసారమైన పద్ధతులు పోకడలకు పోయి
దేవుడిచ్చిన బహుమానమును చంపకండి.
గర్భములో గల శిశువుకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే
వాక్యమును నమ్మే క్రైస్తవ వైద్యుల యొద్దకు వెళ్లి
ఆ సమస్య గూర్చి చర్చించండి.

Comments
Post a Comment