దేవుడు తన సంఘమునకు ఆజ్ఞలు లేదా నియమాలు సంఘ క్షేమాభివృద్ధికై దయచేసినాడు.
ఆతిథ్యం ఇవ్వడం అనే దేవుని ఆజ్ఞ కూడా దేవుడు సంఘముయొక్క క్షేమముకొరకు ఇచ్చిన్నట్లుగా వాక్యంలో మనం చూడగలం.
ఆతిథ్యం ఇవ్వడం దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించే ఒక సాధనమైయున్నది.
సంఘమును ప్రేమించుటకు ఆజ్ఞాపింపబడ్డ సంఘము చేయవలసిన మంచి కార్యము ఆతిథ్యం ఇవ్వడం అని తెలుసుకోవాలి.
సంఘమును ప్రేమించుటకు ఆజ్ఞాపింపబడ్డ సంఘము చేయవలసిన మంచి కార్యము ఆతిథ్యం ఇవ్వడం అని తెలుసుకోవాలి.
నూతన నిబంధనలో ఆతిథ్యం ఇవ్వడం అనే పదానికి గ్రీకులో అర్థం ఏమిటనగా "పరదేశులను ప్రేమించడం".
పాత నిబంధనలోని లేవీ 19:33-34 వచనాలలో, " మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని
బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను"అని వ్రాయబడింది.
అబ్రహాము నుండి కూడా ఆతిథ్యమును గూర్చి మనం నేర్చుకోగలం.
ఆది 18:1-8 వచనాలలో తన ఎదుట గల ముగ్గురు మనుష్యులను తన గృహానికి ఆహ్వానించి వారికి భోజనం సిద్ధ పరిచిన సంఘటన వాక్యంలో మనకు పరిచయమే. వారెవరో తెలియకపోయినా, ఆతిథ్యం ఇవ్వడానికి ఆతృత పడిన
అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు.
నూతననిబంధన కాలంలో ఈ రోజుల్లో ఉన్నట్లుగా హోటళ్లు లాడ్జిలు ఉండేవి కావు. దూర ప్రయాణం చేసేవారు ముఖ్యంగా ఇలా ఆతిథ్యమిచ్చే వారిపై ఆధారపడేవారు.
విశ్వాసులు ఈ ఆతిథ్యం ఇవ్వడం అనే పరిచర్య గురించి నూతన నిబంధనలో ఆజ్ఞాపించబడినట్టుగా మనం చూస్తాం.
రోమా 12:13 - పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
ఆతిథ్యము ఇవ్వడం క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రేమకు సూచన యున్నది. ప్రేమ దయ చూపించును మరియు
స్వప్రయోజనము విచారించుకొనదు (1 కొరింథీ 13:3) కావున, తమ సమయం మరియు డబ్బు వెచ్చించి ఆతిథ్యమివ్వడానికి, ప్రేమను కనపరచడానికి క్రైస్తవులు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది.
స్వప్రయోజనము విచారించుకొనదు (1 కొరింథీ 13:3) కావున, తమ సమయం మరియు డబ్బు వెచ్చించి ఆతిథ్యమివ్వడానికి, ప్రేమను కనపరచడానికి క్రైస్తవులు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది.
అపోస్తలుడైన యోహాను తాను వ్రాసిన మూడవ పత్రికలో, యేసుక్రీస్తు నామమున బయలుదేరిన వారికి ఆతిథ్యం ఇవ్వడాన్నిబట్టి గాయి అనే వ్యక్తిని మెచ్చుకోవడం మనం గమనిస్తాం.
ప్రేమ అనేది ఒక క్రియ. మాటలతో ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు గానీ చేతలతో చేసినప్పుడే ఒక వ్యక్తికి ఇతరులపై ప్రేమ ఉందని తెలుసుకోగలం.
అయితే కొంతమంది సణుక్కుంటూ గొణుక్కుంటూ ఆతిథ్యం ఇస్తారు. పేతురు తన మొదటి పత్రిక( 4:9 )లో వారి కొరకే
"సణుగుకొనకయు ఒకనికొకడు ఆతిథ్యమివ్వుడి" అని సరి చేస్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువు తన సంఘమును సణుగుతూ ప్రేమించలేదు కానీ తన స్వరక్తమిచ్చి సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు.ఆయన పిల్లలుగా అదే ప్రేమతో సణుగుకొనక ఇతరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం.
పౌలు సంఘ కాపరులు కలిగి ఉండాల్సిన లక్షణాలను గూర్చి రెండవ తిమోతి (3:3)లో
ప్రస్తావిస్తూ కాపరి అతిధి ప్రియుడై ఉండాలని వ్రాశాడు.
ప్రస్తావిస్తూ కాపరి అతిధి ప్రియుడై ఉండాలని వ్రాశాడు.
పాస్టర్ లు సంఘమును ప్రేమించి ఆతిథ్యమిచ్చే వారిగా ఉండాలని ఇక్కడ వ్రాయబడింది.
( విచారకరంగా విశ్వాసులు కాపరికి ఆతిథ్యం ఇవ్వడం నేడు జరుగుతుంది కానీ, కాపరులు విశ్వాసులను తమ గృహాలకు పిలిచి ఆతిథ్యం ఇవ్వడం అరుదుగా చూస్తున్నాం).
గమనించదగిన విషయం ఏమిటంటే ఆతిథ్యం ఇవ్వడం సంఘ కాపరికి మరియు విశ్వాసులకు ఒక ముఖ్యమైన పరిచర్యగా పై వ్యాఖ్యలను బట్టి మనం తెలుసుకోవచ్చు.
క్రైస్తవ సంఘములో కనుమరుగవుతున్న అద్భుతమైన పరిచర్య ఆతిథ్యం ఇవ్వడం.ప్రతి విశ్వాసి చేయదగిన మరియు
చేయగలిగే ఈ పరిచర్య నేటి దినాలలో క్రైస్తవులు నిర్లక్ష్యం చేయడం బాధాకరం.
ఆతిథ్యం ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం.
1.దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం కావున ఆతిథ్యం ఇవ్వడం వలన దేవునికి మహిమ కలుగుతుంది.
2. ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా దేవుని ప్రేమను చూపించే అద్భుతమైన పరిచర్య ఆతిథ్యం.
3. దేవుని ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకొనే అవకాశం కలుగుతుంది.
4. సంఘ సభ్యులతో వ్యక్తిగతంగా వివరంగా దైవిక విషయాలు పంచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకొనుటకు
అనువైన సమయం దొరుకుతుంది.
5. ఒకరికొకరు ప్రార్ధన చేసుకోవడానికి కూడా అవకాశముంటుంది.
ఆతిథ్యం ఇవ్వడం అనగా ప్రతిసారీ భోజనానికి పిలవడం కాదు కానీ వ్యక్తిగతంగా నాణ్యమైన సమయాన్ని సంఘ సభ్యులతో గడపడం అని ఒక గ్రంథకర్త వివరించాడు.
చివరిగా హెబ్రీ 13:1-2లో " సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన
కొందరు యెరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి".
దేవుని మహిమార్థమై ఈ పరిచర్యను స్థానిక సంఘాల్లో విశ్వాసులుగా, కాపరులుగా చేస్తూ ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవడానికిమనలను మనం సిద్ధపరుచుకొందుము గాక !
Comments
Post a Comment