మొదటిగా విశ్వాసులనగా ఎవరో చూద్దాం.
యేసుక్రీస్తు యొద్ద పాపములు ఒప్పుకొని, మారు మనస్సు పొందుకొని వాక్యానుసారముగా జీవించే వారిని విశ్వాసులుగా చెప్పవచ్చును.
ఏ క్షణములో అయితే ఒక వ్యక్తి ప్రభువు యందు విశ్వాసముంచుతాడో , అప్పుడే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి నిత్యజీవమును పొందుకుంటాడని, ఆ వ్యక్తిని క్రైస్తవ విశ్వాసిగా బైబిల్ బోధిస్తుంది.
ఆత్మీయ మరణానికి లోనైన పాపిని, ఆయన చిత్తములో, ఆయన మహిమ కొరకు, తన కుమారుడైన క్రీస్తు మరణ పునరుత్తానం ద్వారా, పాప క్షమాపణ నిచ్చి కాపాడుటను "రక్షణ"గా నిర్వచించవచ్చు.
రక్షణ కార్యం ద్వారా దేవుని వలన కలిగిందే . దేవుడు, రక్షించబడిన వ్యక్తికి నూతన హృదయమునిచ్చి, పరిశుద్ధాత్మ చేత ఆత్మీయ జీవితములో కొనసాగుటకు సహాయం చేస్తాడు.
రక్షణ కార్యం ద్వారా దేవుని వలన కలిగిందే . దేవుడు, రక్షించబడిన వ్యక్తికి నూతన హృదయమునిచ్చి, పరిశుద్ధాత్మ చేత ఆత్మీయ జీవితములో కొనసాగుటకు సహాయం చేస్తాడు.
అయితే కొంతమంది ఎప్పుడైతే ఈ రక్షించబడిన వ్యక్తి పాపం చేస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి రక్షణ కోల్పోతాడని చెబుతుంటారు. వాక్యము ప్రాథమికంగా, ప్రాముఖ్యముగా వీరి మాటలతో ఏకీభవించట్లేదు కావున నేను కూడా వారితో ఏకీభవించను.
విశ్వాసి రక్షణ కోల్పోడు అని బోధించే వాక్య భాగాలను పరీక్షించే ప్రయత్నం చేద్దాం.
1. యోహాను 3:16 వ వచనములో, దేవుడు తన కుమారుడైన క్రీస్తు యందు విశ్వాసముంచువారికి, నిత్యజీవము అనుగ్రహించెను అని వ్రాయబడింది.
ఈ వచనం ప్రకారం, రక్షించబడిన వ్యక్తి నిత్యజీవము పొందుకున్నాడు.
ఒకవేళ రక్షించబడిన వ్యక్తి రక్షణ కోల్పోతాడని అనుకుంటే, ఆ వ్యక్తి దేవుడిచ్చిన నిత్యజీవమును కోల్పోవడమే అని అర్థం. అయితే, నిర్వచనం ప్రకారం, నిత్యజీవమనగా, నిత్యమూ ఉండేది కానీ మధ్యలో విడిచిపోయేది కాదని తెలుసుకోవాలి.
2. యోహాను 5:24వ వచనంలో "నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోకి దాటియున్నాడని" బోధించాడు.
ఈ వచనం ప్రకారం, రక్షణ కోల్పోవడమనగా "మరణం నుండి నిత్యజీవములోకి దాటినవాడు తిరిగి మరణించడం అని అర్థం". ఒక రకంగా యేసు నిత్య జీవమిచ్చుటకు శక్తిలేనివాడని కూడా దీని అర్థమైయున్నది.
3. రోమా 8:38-39 వచనాలలో "మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను" అని పౌలు వ్రాసాడు.
ఈ వచనం ప్రకారం "రక్షణ కోల్పోవడం అనగా "పైన వ్రాయబడినవన్నీ దేవుని నుండి మనలను వేరు చేసే శక్తిగలవని అర్థం".
మనలను రక్షించిన దేవుడే, రక్షణలో కొనసాగిస్తాడు కదా !
4. ఎఫెసీ 1:13,14 వచనాలలో, మీరును సత్యవాక్యమును, అనగా రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఈ ఆత్మ సంచకరువుగా ఉన్నాడు అని వ్రాయబడింది.
ఈ వాక్యం ప్రకారం, రక్షణ కోల్పోవడం అనగా "ఆత్మ చేత శాశ్వతముగా, నిత్యత్వముకై ముద్రింపబడిన క్రైస్తవుడు, ఆత్మను కోల్పోవడమే అని అర్థం".
5. రోమా 5:1 వ వచనంలో "విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడినాము"అని బైబిల్ బోధిస్తుంది. అనగా రక్షించబడిన వ్యక్తి, దేవుని యెదుట నీతిగలవానిగా నిలబడతాడని అర్థం.
రక్షణ కోల్పోవడం అనగా, దేవుడు తన మాటను వెనక్కు తీసుకొని, ఇంతకుముందు చేసిన వాగ్దానమును కొట్టివేయడమే అని గమనించాలి.
క్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత, తిరిగి అనీతిమంతుడయ్యే అవకాశం లేదుకదా !
దేవుడిచ్చిన మాట వెనక్కి తీసుకోడు, ఆయన చేసిన కార్యం విఫలమవ్వదు.
6. చివరిగా, రోమా 8:30లో "ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను" అని వ్రాయబడింది.
రక్షణ నిమిత్తమై దేవునిచే నిర్ణయించిబడినవారు, నీతిమంతులుగా తీర్చబడి , రక్షణలో చివరి దశయైన మహిమపరచబడుటలో తప్పకుండా పాల్గొంటారని ఈ వాక్యం సెలవిస్తోంది.
అనగా పిలవబడిన వారందరు చివరివరకు రక్షణలోనే కొనసాగుతారని అర్థం.
పై వాక్య బాగములను బట్టి రక్షించబడిన వ్యక్తి, తన రక్షణ కోల్పోయే అవకాశం లేదని తెలుసుకోవచ్చు. రక్షణ, మనుష్యుల వలన కలిగింది కాదు, అది దేవుడిచ్చిన వరం. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వ్యక్తులను దేవుడు తిరిగి వదిలేయడు. ఆయన హస్తములో మనలను చెక్కుకున్నాడు. ఆ దేవాది దేవుని చేతి నుండి మనలను తిరిగి లాక్కొనే శక్తి ఎవరికీ లేదనే విషయం సంపూర్తిగా నమ్మవలసినవారమైయున్నాము.
ఒక విషయం గమనిద్దాం. రక్షించబడినను క్రైస్తవుడు పాపం చేసే అవకాశం ఉన్నది. కానీ ఆ వ్యక్తి, దేవుని కృపలో తిరిగి లేచి,తన పాపం ఒప్పుకొని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సాహపరచబడి, దేవునితో సమాధానపడి, మరలా ఆ పాపం చేయకుండా ప్రయత్నిస్తాడు. ఈ వ్యక్తి పాపం వలన రక్షణ నుండి తొలగిపోడు కానీ, దేవునిలో గల ఆత్మీయ సంతోషము నుండి దూరమౌతాడు. ఎప్పుడైతే ప్రాయశ్చిత్త మనసుతో ప్రభువు యొద్దకు వస్తాడో, ఆయన క్షమాపణ పొందుకొని దేవునిలో గల ఆనందమును పొందుకుంటాడు.
ఎవరైతే పాపము పట్ల అసహ్యం,పశ్చాత్తాపం లేకుండా,పాపుములోనే కొనసాగుతున్నట్లైతే మొదటగా వారు రక్షించబడలేదని తెలుసుకోవాలి.
1 యోహాను 2:19లో విశ్వాసులుగా చెలామణి అవుతూ బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి "వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు బయలు వెళ్లిరి " అని వ్రాయబడింది. అనగా వారు ముందుగా విశ్వాసులు కారనే విషయం ఇక్కడ యోహాను భక్తుడు వివరిస్తున్నాడు.
కావున, క్రైస్తవుడు దేవుని వలన పొందుకున్న రక్షణ కోల్పోడు అని బైబిల్ పరముగా చెప్పగలము. రక్షణ ఇచ్చేది దేవుడే, రక్షణ కొనసాగించేది దేవుడే అనే సత్యం నమ్మదగినదై యున్నది.
ఎవరైతే పాపము పట్ల అసహ్యం,పశ్చాత్తాపం లేకుండా,పాపుములోనే కొనసాగుతున్నట్లైతే మొదటగా వారు రక్షించబడలేదని తెలుసుకోవాలి.
1 యోహాను 2:19లో విశ్వాసులుగా చెలామణి అవుతూ బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి "వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు బయలు వెళ్లిరి " అని వ్రాయబడింది. అనగా వారు ముందుగా విశ్వాసులు కారనే విషయం ఇక్కడ యోహాను భక్తుడు వివరిస్తున్నాడు.
కావున, క్రైస్తవుడు దేవుని వలన పొందుకున్న రక్షణ కోల్పోడు అని బైబిల్ పరముగా చెప్పగలము. రక్షణ ఇచ్చేది దేవుడే, రక్షణ కొనసాగించేది దేవుడే అనే సత్యం నమ్మదగినదై యున్నది.
Comments
Post a Comment