సెక్షన్ 377ను రద్దు చేసి స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చి నెల రోజులు గడవకముందే భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 497 ను కూడా కొట్టివేసి మరో సంచలన ప్రకటన చేసింది.
ఐపీసీ 497లో “ మరోకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధించిన నేరం” అని వ్రాయబడింది.
ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధ నేరంగా పరిగణించి పురుషుడికి ఐదేళ్ల జైలు శిక్ష కానీ, జరిమానా కానీ లేదా రెండూ విధించేవారు.
కానీ నేటి సుప్రీమ్ కోర్టు, ఈ చట్టాన్ని కొట్టివేసి వివాహేతర సంబంధం నేరం కాదు, అది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, భార్యల హక్కులను కాలరాస్తుంది అని తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు కావున ఈ విషయములో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది.
అంతే కాక దీనిని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని కూడా పేర్కొంది.
ఈ సెక్షన్ 497 రద్దు వలన, వివాహ వ్యవస్థకు పెద్ద గాయమయ్యే అవకాశమున్నది.
ఇప్పటికే వివాహేతర సంబంధాలు విజృంభించి ఎన్నో కుటుంబాలు విడిపోతున్న తరుణంలో
ఈ తీర్పు భారత వివాహక్రమానికి మచ్చ తెచ్చేదే అని చెప్పడంలో సందేహం లేదు.
పెళ్లి చేసుకున్న పిదప భార్య మరో వ్యక్తితో శారీరక సంబంధం సులభంగా ఏర్పరుచుకొని చట్టం పరిధిలో తప్పు కానందున, పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోయి జీవించే వారు ఎక్కువైపోతారు.
ఫలితంగా కుటుంబ కలహాలు, పిల్లల జీవితాలు ఇబ్బందుల గుండా వెళ్లడం జరగొచ్చు.
ఫలితంగా కుటుంబ కలహాలు, పిల్లల జీవితాలు ఇబ్బందుల గుండా వెళ్లడం జరగొచ్చు.
ముఖ్యముగా వివాహం యొక్క పవిత్రత మరియు పునాదికే కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి కూడా కలిగే ప్రమాదమున్నది.
మరో విషయమేమిటంటే వివాహేతర సంబంధం వలన, భర్త లేదా భార్యపై ఇష్టం కోల్పోయి, సులభంగా విడాకులు తీసుకొని జీవించవచ్చు కనుక, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే అవకాశం కూడా ఉన్నది.
భారత దేశానికి వివాహ విలువలలో, కుటుంబ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్నది.
కానీ పాశ్చాత్త్య దేశాల సంస్కృతి యొక్క ప్రభావము వలన ఈ మార్పులు చోటుచేసుకోవడం బాధాకరం.
సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో ముందుకెళ్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటూనే, నైతిక విలువలలో ఒక్కో అడుగు వెనక్కు వేస్తున్నాం.
అయితే బైబిల్ వివాహేతర సంబంధమును వ్యభిచారముగా పరిగణిస్తుంది.
దేవుని ప్రణాళికలో చేయబడిన వివాహ వ్యవస్థ ఘనమైనది మరియు పవిత్రమైనది.
భార్యా భర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధమును దేవుడు అనుమతిస్తాడు.
వివాహము ముందు మరియు వివాహేతర లైంగిక చర్యలు దేవుని దృష్టిలో పాపము అని వాక్యం సెలవిస్తుంది.
వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును (హెబ్రీ 13:14).
దేవుడు వ్యభిచారులను శిక్షిస్తాడని, తన రాజ్యములో వారికి చోటు లేదని చాలా స్పష్టముగా బోధించాడు (1 కొరింథీ 6:9-10).
తరాలు మారినా, తీర్పులు మారినా దేవుని వాక్యం ఎన్నటికీ మారదు.
నిజమైన దేవుని ఎరుగని వ్యక్తివి నీవైతే, ఒక మంచి వర్తమానము నీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను.
రెండువేల సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా ఈ లోకమునకు వచ్చి, నీ పాపాల కొరకు సిలువలో మరణించి, మూడవ రోజున తిరిగి లేచెను.
రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదనే మాటను, తన రక్తము చిందించి నెరవేర్చిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు.
మనుష్యులందరూ పాపులే. నేనే పాపము చేయలేదని చెప్పే వ్యక్తి లేనే లేడు.
వివాహేతర సంబంధం అనే పాపములో నీవున్నట్లైతే, ఆ పాపము దేవుని దగ్గర ఒప్పుకొని, ఆయనిచ్చే క్షమాపణ పొందుకోమని విన్నవిస్తున్నాను.
ఒకవేళ క్రైస్తవునిగా ఉంటూ ఈ పాపములో నీవు కొనసాగుతున్నట్లైతే, దేవుని ఉగ్రత
నీ మీద కుమ్మరింపబడక ముందే పాప క్షమాపణకై ప్రభువు యొద్ద వేడుకొని, తిరిగి ఆ పాపము చేయకుండా తీర్మాణం చేసుకోమని వేడుకుంటున్నాను.
పోతీఫర భార్య ఇష్టపూర్వకంగా తనతో శయనించుమని అడిగినప్పుడు, నీవు అతని భార్యవైనందున..నెనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని పలికిన యోసేపు వలే నిలబడాలి.
పోతీఫర భార్య ఇష్టపూర్వకంగా తనతో శయనించుమని అడిగినప్పుడు, నీవు అతని భార్యవైనందున..నెనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని పలికిన యోసేపు వలే నిలబడాలి.
దేవునికి అసహ్యమైన వ్యభిచారమును విడిచిపెట్టి, ఆయన బిడ్డగా నూతన జీవితం ఆరంభించుటకు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.
దేవుడు నిజమైన ఒప్పుదలను అంగీకరించి, తప్పకుండా క్షమించి సహాయం చేస్తాడు.
లోకానికి, న్యాయస్థానాలకు పైగా గల సృష్టికర్తయైన దేవుని ఆజ్ఞలకు లోబడి,వాక్యానుసారముగా జీవించబద్ధులమైయున్నాము కనుక జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకుందాం.
మన చుట్టూ ఇటువంటి ఇబ్బందికరమైన, పాప సహితమైన కార్యములు ఎన్ని పెరుగుతున్ననూ, లోకములో ఒకరిగా కాక,లోకానికి వేరుగా ఉండడానికి మనం ఎన్నుకోబడ్డ వారమని మరువక దేవుని సహాయముతో ఆత్మీయ యాత్ర కొనసాగించుదాం.

Nice
ReplyDeleteYs...we need to ignore the world n follow the commandments of the LORD almighty...he is our goal n destination...lets be particular regarding separation...
ReplyDeleteవివిధ దేశాల్లో విలువలు వివిధ రకాలుగా వుండవచ్చు.అది ఆ దేశ చెట్టప్రకారం సరియైనదీ కావొచ్చు..చెట్టాన్ని మర్చుకొని కూడ సరియైనదీ అని వారు అనుకోవచ్చు...కానీ Bible లోని నీతి,నైతిక విలువలు,పరిశుద్దత ,సత్యం ఎప్పటికీ మారనివి...excellent...Anna..
ReplyDeleteWell said Anna...We need to obey Gods commandments ...Not worldly judgements ...
ReplyDelete