1. వైవాహిక జీవితం · అకుల మరియు ప్రిస్కిల్ల ఎప్పుడూ కలిసి ప్రస్తావించబడ్డారు (అపొ. కార్యములు 18:2,18,26; రోమా 16:3). · వారు ఒక్కశరీరముగా ఉండడంలో బహుశా మాదిరిగా ఉన్నారు అనుకోవచ్చు. · వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలియదు కానీ వారి వైవాహిక జీవితం దేవునికి మహిమకరంగా ఉందని అనుకోవచ్చు. · మన వివాహ బంధం ఒకటిగా ఉండాలి. ఒకదానితో ఒకటి పెనవేయబడిన రెండు తాళ్లు ఒక దృఢమైన తాడుగా బలంగా ఉంటుందో, వివాహం కూడా అలానే ఒక్క తాడుగా ఉండాలి. · అందుకే దేవుని వాక్యంలో, వివాహంలో వారిని ఒక్కరిగా దేవుడు జతపరిచాడు అని చెబుతాడు. · నిర్ణయాల్లో ఐక్యత, ప్రవర్తనలో ఐక్యత, ప్రేమలో ఐక్యత కలిగుండడానికి ప్రయత్నం చేయాలి. · పెళ్లైన జంటను చూస్తే ఇతర...