4:5 - సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు , మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము . ఆ రోజుల్లేనే ప్రజలు వివిధ దేవుళ్లు దేవతలను పూజించేవారు . అటువంటి ప్రజల మధ్య గల ఆయన నిబంధన ప్రజలు వారి దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని మీకా ప్రవచిస్తున్నాడు . స్మరించుకోవడం అంటే రోజంతా ఆయన నామాన్ని ఉచ్చరించడం కాదు , ఆయన అధికారం క్రింద ఉండి , ఆయనకు విధేయత చూపడం . 1-4 వచనాల్లో అంతిమ విమోచన జరగబోతుంది , విమోచన కర్త తన పని సంపూర్ణం చేయబోతున్నాడు కావున మనం మన దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన మాటలకు లోబడుతూ బ్రదుకుదాం, అని మీకా బోధిస్తున్నాడు . ఇది ప్రస్తుతం ఉన్న మనకు సరిగ్గా వర్తిస్తుంది . మన చుట్టూ వివిధ మతాలు , వారు పూజించే వివిధ దేవుళ్లు దేవతలు ఉన్నారు . వారు వారి దేవతలను దేవుళ్లను నిష్ఠగానే పూజిస్తున్నారు , ఆరాధిస్తున్నారు . తమ శరీరాలను నలగకొట్టుకుంటున్నారు , దూర ప్రయాణాలు చేస్తున్నారు , డబ్బు , బంగారం అర్పిస్తున్నారు , ...