Skip to main content

Posts

Showing posts from February, 2024

నాయకుల ప్రధాన పరిచర్య - సంఘ సహకారం

ఆదిమ సంఘములో,అంతా బాగుంది అనుకున్న సమయంలో, ఒక అలజడి రేగింది.   అపోస్త 6 వ అధ్యాయంలో ఆ సమస్య తాలూకు సంగతులు మనం చదవగలం. గ్రీకు భాష మాట్లాడే యూదులు తమ విధవరాండ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని హెబ్రీయుల మీద సణిగారు.  ఈ వార్త అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వారు చాలా ప్రాముఖ్యమైన, సంఘానికి క్షేమభివృద్ధిని కలుగజేసే రెండు మాటలు చెప్పడం మనం చదువుతాము. మొదటిది, మీలో ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఈ పనికి ఏర్పరుచుకోండి. రెండవది, అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక ఉంటాము అని చెప్పారు. సంఘము దేవుడు ఉద్దేశించిన విధంగా ఈ లోకంలో పరిచర్య చేయాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. అన్నిపనులు సంఘ నాయకులు చేయకుండా,ఇతరులకు అప్పజెప్పడం మరియు ప్రాముఖ్యమైన పనులు సంఘ నాయకులు చేయడం. సంఘ నాయకులు చేసే ప్రాముఖ్యమైన పని ఏమిటి? సంఘము కోసం ప్రార్థన చేయడం మరియు సంఘాన్ని దేవునిలో పెంచి పోషించడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని సరైన అర్థ వివరణతో బోధించడం. మిగతా పనులు సంఘ నాయకులు చేయకూడదని అర్థం కాదు గాని ఈ రెండు ప్రాముఖ్యమైన పనులు చేయకుండా వీటిని నిర్...

వ్రాయడం ఒక క్రమశిక్షణ

  రోజు మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే దానికి ఒక ప్రధానమైన కారణం ,  పుస్తకాలు.  మన విద్యా విధానంలో గల పుస్తకాలు చదివి మనం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం ,  వ్యాపారాలు చేస్తున్నాం ,  సంస్థలను నడుపుతున్నాం. అంతేకాదు, ప్రతి దేశానికి ఆ  దేశంలో నాయకులు, ప్రజలు ఏ విధంగా పనిచేయాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే సంగతులు కలిగిన పుస్తకం ఉంటుంది. అందుకే,  దేశాలను నడిపించేది కూడా పుస్తకాలే అని మనం అనొచ్చు.   అందువల్లే, ఒకాయన  “  చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో ,”  అన్నాడు. పుస్తకాల్లో గల సాహిత్యంలో, సంగతుల్లో ఉన్న శక్తి అలాంటిది.    అయితే ,  వ్రాయడం అనేది కొందరికి మాత్రమే ఉండే దేవుని వరం.  రోజూ ఏదో ఒకటి రాయడం వారికి అలవాటుగా ఉంటుంది.  వ్రాయడం, దేవుడు వరంగా ఇచ్చినా ,  ఆ వరాన్ని క్రమశిక్షణగా వాడే వారే ఎక్కువగా వ్రాయగలరు.   క్రమశిక్షణ కలిగి వ్యాసాలు పుస్తకాలు రాయడం అందరూ చేయలేరు.    ఎందుకంటే, ఒక వ్యాసం లేదా పుస్తకం రాయడం సామాన్య...