Skip to main content

Posts

Showing posts from November, 2023

సంఘ నిబంధన ప్రాముఖ్యత

సంఘం అంటే ఆదివారం రెండు గంటలు కూర్చుని ప్రసంగం విని వెళ్లిపోయే ఒక కార్యక్రమం అని చాలామంది క్రైస్తవులు అనుకుంటుంటారు అదే విధంగా చాలా మంది కాపరులు కూడా సంఘాన్ని నడిపిస్తుంటారు. కానీ సంఘమంటే దేవుని కుటుంబమని (1తిమోతి 3:15), సంఘములోని విశ్వాసులు ఒకరితో ఒకరు ప్రేమ సంబంధాలు కట్టుకోవాలని (యోహాను 13:34,35) బైబిల్ గ్రంధం బోధిస్తుంది. కుటుంబం పట్ల నిబద్ధత కలిగి ఉండడం చాలా ముఖ్యం. దేవునిలో అభివృద్ధి చెందడానికీ, దేవుడు ప్రసాదించిన తలాంతులను వరాలను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడడానికీ ఆ కుటుంబంతో అంటుకట్టబడి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అంటుకట్టబడడం అంటే సంఘ కార్యక్రమాలకు క్రమంగా హాజరవడం, సంఘంతో కలిసి వాక్యం నేర్చుకోవడం,సంఘములో గల ఇతరులతో సంబంధాలు కట్టుకోవడం, వారి సుఖదుఖాలలో భాగం పొందుకోవడం మొదలులైనవి చేయడం అని అర్థం. ఇది పాటించడానికే మా సంఘములో ఎవరైనా సభ్యులు కాదలిస్తే వారికి సభ్యత్వ తరగతులు తీసుకుంటాం. ఆ తరగతుల్లో కల్తీ లేని వాక్యానుసారమైన సువార్త, నూతన నిబంధన సంఘము గూర్చిన బోధ, క్రీస్తు శిష్యులుగా కలిగి యున్న బాధ్యతలు, సంఘ విశ్వాసాలు మొదలైన సంగతులు బోధిస్తాము. ఇంత అవసరమా అన్ని కొందరు అ...

ఐక్య పరిచర్య

రెండు రోజుల క్రితం హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ గా క్యాంప్ జరుపుకున్నాం. చిన్న పెద్ద కలిసి దాదాపు 90 మంది హాజరయ్యారు. ఇంతమందిని కలుపుకొని ఒక ప్రదేశానికి వెళ్లి రెండు రోజులు చర్చ్ క్యాంపు కలిగి ఉండడానికి చాలా పని చేయాల్సి వస్తుంది. ఆ రెండు రోజుల షెడ్యూల్ తయారు చేయడం, స్పీకర్స్ యొక్క ప్రయాణాలు చూసుకోవడం, క్యాంపుకి వచ్చిన వారికి రూమ్స్ కేటాయించడం, రూమ్స్ లో ఏదైనా సమస్య వస్తే త్వరగా పరిష్కరించడం, అందరినీ సమయానికి సెషన్స్ హాజరవ్వడానికి ప్రోత్సహించడం, సమయానికి భోజనం కొరకు అందరినీ సిద్ధపరచడం, రాను పోనూ అందరికీ రవాణా సౌకర్యం చూసుకోవడం మొదలైన ఎన్నో పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా కాపరిగా నేను కాకుండా మిగతా విశ్వాసులే చూసుకున్నారు. నా మీద ఈ మాత్రం భారం పడకుండా కలిసి ఈ పరిచర్యలు చేశారు. 1 కొరింథీ 12 లో చెప్పబడిన విధంగా దేవుడు వారికిచ్చిన వరాలను సంఘానికి క్షేమం కలిగించడానికి వాడారు. సంఘానికి కాపరిగా పరిచర్య చేసే వ్యక్తి అన్నీ తానే చేయాలి అనుకోకుడదు. ఇటువంటి పరిచర్యలను నమ్మకమైన విశ్వాసులకు అప్పజెప్పాలి. వారికి పని అప్పజెప్పిన తరువాత వారిని నమ్మాలి. కొంతమంది నాయకులు ఇతరులకు ఈ పరిచర్య చేయమని చ...