సంఘాల్లో ఐక్యత లేకపోవడానికి ఒక కారణం సమూహవాదం ( groupism ). ఒక్కటిగా ఉండాల్సిన సంఘములో చిన్న చిన్న గ్రూపులు చేయడం. 1 కొరింథీ 1:10 - సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు ? ఎందుకంటే కొరింథీ సంఘములోని విశ్వాసులు కొందరు పౌలు గ్రూపు, అపొల్లో గ్రూపు, పేతురు గ్రూపు, క్రీస్తు గ్రూపుగా ఏర్పడి సంఘములో చెలామణీ అవుతున్నారు. రక్షించబడిన వ్యక్తులే అయినా, ఒకే సంఘములో ఉన్నా, ఈ విశ్వాసులు ఇలా గ్రూపులుగా విడిపోయారు. ఎప్పుడు గ్రూపులు మొదలైతాయో తెలుసా ? వేర్వేరు ప్రజలకు దేవుడు వేర్వేరు వరాలు (gifts) దేవుడిస్తాడు. అపోల్లో పౌలు పేతురు ముగ్గురూ వేర్వేరు గిఫ్ట్స్ కలిగినవారు. వారి వరాల నుండి విశ్వాసులు మేలు పొందుకున్నారు. కానీ, దేవుడు వారికిచ్చిన వరాలను బట్టి, వారినే వెంబడిస్తూ గ్రూపులుగా విశ్వాసులు తయారయ్యారు. ఈ మాటలు గుర్తు పెట్టుకుందాం : నాయకులని వెంబడించడం తప్పు కాదు కానీ నాయకులను క్రీస్తు స్థానంలో ఉంచడం మాత్రం చ...