Skip to main content

Posts

Showing posts from December, 2019

శిక్ష తప్పించేదెవరు ?

హైదరాబాదులో నవంబర్ నెలలో జరిగిన సంఘటన యావద్భారత దేశాన్ని కలిచివేసింది.  అంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఇటువంటివి జరిగినా, ఈసారి జరిగిన సంఘటన వేగంగా దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. అది డాII ప్రియాంక పై జరిగిన అత్యాచారం మరియు ఆమె సజీవ దహనం. అత్యంత దారుణంగా,కిరాతకంగా ఆ అమ్మాయిని హత్య చేయడం ఎంతో మందిని బాధించింది. ఆ నలుగురు కుర్రాళ్ళు చేసిన ఈ పైశాచికకార్యాన్ని దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది. మనం కూడా ఇటువంటి చర్యలను ఖండించాల్సిందే.  ఈ పని చేసిన వారిని తమకు అప్పగించమని, వారిని మేమే చంపుతాం అని ప్రజలు పోలీస్ స్టేషన్ ముట్టడించి ధర్నాలు చేయడం కూడా మనందరికీ తెలిసిందే.  ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఆ నలుగురు చనిపోవడం చూసి,వారు చేసిన పాపానికి తగిన శిక్ష పడిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.  అవును,వారు చేసింది పాపమే,వారికి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ప్రతి తప్పుకు,పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి.  అయితే, దయచేసి నన్ను కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి.  వ్యభిచారపు చూపుతో ప్రతి రోజు హృదయంలో వ్యభిచారం చేస్తున్న వారికి ప...

ఏది వాక్యానుసారమైన, ఆరోగ్యకరమైన సంఘము - PART II

గత ఆర్టికల్లో వాక్యానుసారమైన, ఆరోగ్యకరమైన సంఘమునకు ఉండాల్సిన 2 లక్షణాలను నేను వివరించాను. మొదటిది వాక్యానుసారమైన బోధ, రెండవది సహవాసం. మిగతా 3 లక్షణాలను ఇప్పుడు చూద్దాం. III.సువార్త పని మరియు శిష్యత్వపు తర్ఫీదు   మార్కు16:15, మత్తయి 28:19, 20 వచనాలు గమనిస్తే, దేవుడు మనకు అనగా సంఘానికి ఒక పని అప్పచెప్పాడు అని తెలుసుకోగలం. ఏమిటాపని?   సర్వలోకమునుకు వెళ్లి సువార్త చెప్పడం, విశ్వసించినవారికి బాప్తీస్మమిచ్చి, బోధ చేసి శిష్యులను తయారు చేయడం. అపొస్తలులు చేసింది అదే, అపొస్తలలు కార్యములు, పౌలు పత్రికలు చదివితే కనబడేది అదే. అపొస్తలులు ఎక్కడెక్కడికైతే వెళ్లారో అక్కడ దేవుని సువార్త చెప్పారు, స్థానిక సంఘము స్థాపించారు, నాయకులను లేపారు, విశ్వాసులకు వాక్య తర్ఫీదునిచ్చారు. ఇతరులకు సువార్త చెప్పడం అనేది సంఘము యొక్క ప్రాముఖ్యమైన విధి. సువార్త పని నిర్లక్ష్యం చేసి,ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే సంఘము వాక్యానుసారమైనది కాదని నా అభిప్రాయం. సంఘము సువార్త పని చేయాలి.వ్యక్తిగతంగా మరియు సంఘముగా దేవుని శుభ సందేశమును పాపములో నశిస్తున్న ప...