హైదరాబాదులో నవంబర్ నెలలో జరిగిన సంఘటన యావద్భారత దేశాన్ని కలిచివేసింది. అంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఇటువంటివి జరిగినా, ఈసారి జరిగిన సంఘటన వేగంగా దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. అది డాII ప్రియాంక పై జరిగిన అత్యాచారం మరియు ఆమె సజీవ దహనం. అత్యంత దారుణంగా,కిరాతకంగా ఆ అమ్మాయిని హత్య చేయడం ఎంతో మందిని బాధించింది. ఆ నలుగురు కుర్రాళ్ళు చేసిన ఈ పైశాచికకార్యాన్ని దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది. మనం కూడా ఇటువంటి చర్యలను ఖండించాల్సిందే. ఈ పని చేసిన వారిని తమకు అప్పగించమని, వారిని మేమే చంపుతాం అని ప్రజలు పోలీస్ స్టేషన్ ముట్టడించి ధర్నాలు చేయడం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఆ నలుగురు చనిపోవడం చూసి,వారు చేసిన పాపానికి తగిన శిక్ష పడిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అవును,వారు చేసింది పాపమే,వారికి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ప్రతి తప్పుకు,పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి. అయితే, దయచేసి నన్ను కొన్ని ప్రశ్నలు అడగనివ్వండి. వ్యభిచారపు చూపుతో ప్రతి రోజు హృదయంలో వ్యభిచారం చేస్తున్న వారికి ప...