ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే ఏమయ్యేది? ఒకవేళ హవ్వ అపవాది మాటలను నమ్మకుండా ఉంటే ఏమయ్యేది? ఒకవేళ ఆదాము హవ్వలు జీవ వృక్ష ఫలం తింటే ఏం జరిగేది? ఈ ప్రశ్నలు ఊహాజనితమైనవి. ఎందుకంటే, ఇవన్నీ కూడా దేవుడు ఉద్దేశించిన సృష్టి పతనం విమోచన నూతన సృష్టి అనే దేవుని పనికి వేరుగా అడుగుతున్న ప్రశ్నలు. మన థియాలజీ "ఏమైయుండవొచ్చు" లేదా "ఒకవేళ" అనే ప్రశ్నలపై కట్టే ప్రయత్నం చేయకూడదు. దేవుడు తన చిత్తంలో ఏం చేశాడు అనే దానిపై మాత్రమే మన థియాలజీ కట్టుకోవాలి. దేవుడు మనిషి పతనం గురించి ముందే అవగాహన లేనివాడు కాడు. ఆయన సర్వజ్ఞాని. అందుకే ఆదాము హవ్వల పాపం దేవుణ్ణి ఆశ్చర్యపరిచి ఉండదు. ఎందుకంటే ఆయన విమోచన ప్రణాళికలో భాగంగా ఆ పతనాన్ని అనుమతించాడు. అనుమతించడం, పాపాన్ని ఆమోదించడం ఒకటిగా చూడకూడదు. ఒకవేళ ఆమోదిస్తే పాపానికి శిక్ష వేయకూడదు. కానీ దేవుడు పాపాన్ని శిక్షించాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత రెండూ మనకు కనిపిస్తాయి. తన సార్వభౌమ చిత్తంలో తన ప్రణాళిక నెరవేర్చడానికి తద్వారా తన మహిమ నిమిత్తం దేవుడు పతనాన్ని అనుమతించాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి చేసిన పాప...