మత్తయి 9:37,38 - కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు , గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను . ఈ మాటలు యేసు ప్రభువు జన సమూహమును చూసి అన్నట్లుగా 36 వ వచనం మనకు చెబుతుంది . ఎంతో మంది వ్యాధులతో , బాధలతో ఆయన దగ్గరికి వచ్చారు . వారిని సరైన విధానంలో నడిపించే నాయకులు లేరు . బహుశా , పరిసయ్యులు ప్రజల మీద పెట్టిన కఠినమైన నియమాలను కూడా ఖండిస్తూ ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నాడని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు . గొర్రెల వలె అని వాడినప్పుడు ఆ ప్రజలు కూడా బహుశా గాయాలతో , పాపంతో ఉన్నారని క్రీస్తు ప్రస్తావిస్తున్నాడు . వారికి దేవుని రాజ్యం గురించి చెప్పే నిజమైన నాయకుల అవసరం ఉంది అని క్రీస్తు ఆనాడే చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు . ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రభువు చెబుతున్నాడు . కోతకు పనివారు కావాలి అయితే ఆ పనివారిని పంపుమని యజమానిన...