పాత నిబంధనలో దావీదు పేరు వినగానే మొదటగా తాను గొల్యాతును చంపిన విధానం, ఆ తర్వాత బత్సేబాతో చేసిన పాపం గుర్తుకువస్తుంది. దేవుని హృదయానుసారునిగా పిలవబడిన దావీదులో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుగోగలం. అది 2 సమూయేలు పుస్తకంలో మనం చూస్తాం. 2 సమూ 15:13,14లో ఇశ్రాయెలీయులు అభ్షాలోము వైపు ఉన్నారని తెలిసిన దావీదు, అభ్షాలోము నుండి మనం పారిపోదాము రండి అని పట్టణం విడిచి వెళ్లిపోతాడు. ఆయనతో పాటు చాలా మంది అరణ్యానికి పయనమైతారు. 2 సమూ 16లో దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమీ అనే వ్యక్తి దావీదును శపిస్తాడు (5వ). దావీదు మీద మరియు అతని సేవకుల మీద రాళ్లు రువ్వుతాడు (6వ). అంతేకాదు, నరహంతకుడా,దుర్మార్గుడా, ఛీ పో, నువ్వు నరహంతకుడవు కాబట్టే నీకు ఈ గతి పట్టింది అని చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి దావీదును శపిస్తాడు. కానీ, సౌలును దావీదు చంపించలేదని మనకు తెలుసు. సౌలును చంపే అవకాశం రెండు సార్లు వచ్చినా దావీదు చంపలేదు. సౌలు కొన ప్రాణంతో ఉండగా చంపినవాడిని ఉద్దేశించి "యెహోవా అభిషేకించినవానిని చంపడానికి నీవేల చెయ్యి ఎత్తావు? అని వాడిని చంపించాడు దావీదు (2 స...