ప్రభువు పని చేయాలంటే నాకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నాను అని చాలా మంది చెబుతుంటారు. మనలో చాలా మందికి ఉన్న సమస్య సమయం లేకపోవడం కాదు, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోవడం. అనవసరమైన విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించడం ఆపగలిగితే చాలా సమయం, చాలా అవసరమైన విషయాలకు మనం వాడుకోగలం. ఈ నెల ప్రారంభం నుండి నేను చేసిన విషయాలను మీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను. 1. సిరిసిల్లలో పాస్టర్ల సమావేశంలో శారీరక ఆరోగ్యం మరియు ఆత్మీయ ఆరోగ్యం అనే అంశం మీద ప్రసంగం కొరకు దాదాపు 5-8 గంటల స్టడీ చేశాను. 2. పాస్టర్ అంతరంగం అనే పుస్తకం మళ్ళీ ఒక 50 పేజీలు చదివి అక్కడ వారికి బోధించాను (8 th august ) . 3. హామిల్టన్ రాసిన what is Biblical Theology పుస్తకం మొత్తం చదివాను (95 పేజీలు). 4. Biblical Theology కి సంబంధించి ఇతర పుస్తకాలు ఆర్టికల్స్ దాదాపు 50 పేజీలు చదివాను. 5. what is Biblical Theology సగం పుస్తకం తెలుగులో తర్జుమా చేసి discipleship training లో బోధించాను...