Skip to main content

Posts

Showing posts from July, 2024

మార్పు - The Change

  ఈ సంవత్సరం ప్రారంభంలో మా సంఘానికి ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముని అమ్మగారు క్రైస్తవురాలు. ఈ తమ్మునికి క్రైస్తవ్యం గురించి మంచి అభిప్రాయం కూడా లేదు. అమ్మ చెబుతుంటే వినేవాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఇదంతా నిజమేనా? దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఈ తమ్మునితో కొన్ని రోజులు ఉండడానికి ఆ తల్లి హైదరాబాద్ వచ్చారు. మా సంఘంలో గల ఒక కుటుంబం వీరిని సంఘ సహవాసానికి ఆహ్వానించారు. తల్లి గారి ఒత్తిడితో రావడానికి ఈ తమ్ముడు ఒప్పుకున్నాడు. మొదటి రెండు వారాలు కష్టంగా కూర్చున్నాడు. నేను ఒక ఆదివారం నాడు   “తమ్ముడు, క్రైస్తవ్యం గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని మాటలు కలిపాను. దేవుడు నిజమా? అసలు మీరు చెప్పేది నిజమేనా అని చాలా పారదర్శకంగా అడిగాడు. మీరు చెబుతుంది అసలు అర్థం కావట్లేదని కూడా ఒప్పుకున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు తిరిగి అడిగి, కొన్ని విషయాలు చెప్పి “సత్యం తెలుసుకోవాలని ఆశ ఉంటే సరిపోదు, ఆ సత్యం గురించి పరిశోధించాలి కూడా” అని సంఘ సహవాసానికి రమ్మని ప్రోత్సహించాను. అప్పటికే సంఘంలో ఉన్న బ్రదర్స్ తనతో సువార్త ప...