సంఘములో విశ్వాసుల జీవితాలను కాయడానికి దేవుని చేత నియమింపబడ్డ వారే సంఘ కాపరులు (అపోస్త 20:28). సంఘ కాపరుల ప్రధానమైన పరిచర్యలు, దేవుని వాక్యం బోధించడం మరియు సంఘం కొరకు ప్రార్థించడం (అపోస్త 6:4). కేవలం ఈ రెండు మాత్రమే కాపరులు చేయాలని ఇక్కడ అర్థం కాదు కానీ, ఇవి అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతలు అని తెలుసుకోవాలి. ఎందుకంటే, దేవుని వాక్యం సరిగా బోధించబడితే, క్రైస్తవ జీవితాలకు చాలిన దేవుని వాక్యమే, విశ్వాసుల జీవితాలను చక్కపరుస్తుంది, సరిదిద్దుతుంది, ప్రోత్సాహపరుస్తుంది. వాక్యం బోధించడం చాలా తేలికైన పని కూడా కాదు. ఒక వాక్యానుసారమైన ప్రసంగం సిద్ధపర్చడానికి దాదాపు 10-15గంటల సిద్ధపాటు సమయం అవసరం పడుతుంది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు, సంఘంలో జరుగుతున్న ఇతర పరిచర్యలను కూడా కాపరులు పట్టించుకుంటారు కాబట్టి, చాలా సమయం వీటికి కూడా ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా విశ్వాసులతో మాట్లాడటం, ప్రార్థించడం ఇలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎక్కువగా కష్టపడతారు. అటువంటి సంఘ కాపరులను విశ్వాసులు గౌరవించడం,వారికి విధేయత చూపడం చాలా ప్రాముఖ్యం. పౌలు అదే మాట 1 థెస్స 5:12,13 లో “మరియు ...