Skip to main content

Posts

Showing posts from December, 2023

క్రైస్తవ క్రిస్మస్ పరిచర్య

యేసుక్రీస్తు ప్రభువు పునరుత్తానుడైన తరువాత "మీరు సర్వ లోకమునకు వెళ్లి సువార్త ప్రకటించి శిష్యులను చేయుడి" అని శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రతి తరంలో గల క్రీస్తు శిష్యులకు వర్తిస్తుంది. సువార్త సందేశం ప్రజలకు చెప్పే బాధ్యత విశ్వాసులందరిది. ప్రతి సంఘము సువార్త పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసులను సువార్త ప్రకటన చేయాలని సంఘ నాయకత్వం ప్రోత్సాహించాలి. ఈ క్రిస్మస్ సీజన్లో సువార్త చేయడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, దేవుని శుభవార్తను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మా సంఘంలో గల విశ్వాసులు వారి కాలనీలో, అపార్ట్మెంట్లో చిన్న క్రిస్మస్ మీటింగ్ ఉంది రండి అని ఇరుగుపొరుగు వారిని పిలవమని చెప్పాం. అలా దాదాపు నాలుగు ప్రదేశాలలో సువార్త ప్రకటనకు ప్రణాళిక సిద్ధమయ్యింది. కేవలం క్రీస్తుని ఎరుగని వారినే ఆహ్వానించమని చెప్పాము. మొన్న ఒక మీటింగ్, నిన్న మరో మీటింగ్ ప్రభువు కృపలో ముగించబడినాయి. సంఘమంతా పాల్గొని పరిచర్య చేశారు. ఈ వారం మరో రెండు సువార్త మీటింగ్స్ ఉన్నాయి.  ప్రసంగీకులుగా సువార్త సభల్లో లేదా క్రిస్మస్ మీటింగ్స్ లో బోధించడం వల్ల ఒకే సారి చాలా మందికి సువార్త చెప్ప...

సంఘములో స్త్రీల పరిచర్య

మా సంఘంలో ఉన్న ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఈ మధ్య నాతో ఈ విధంగా చెప్పింది. మా కాలేజ్ లో నేను కొందరితో సువార్త సంభాషణలు చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. క్రీస్తు ఎవరో, క్రైస్తవ్యం అంటే ఏమిటో చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. చాలా మంచిది అని చెప్పి ఇంకా చేయమని ప్రోత్సాహపరిచాను. ఇతరులు అడిగే ప్రశ్నలకు సహాయకరంగా ఉండే పుస్తకం కూడా ఇచ్చాను. మా సంఘానికి చెందిన మరో సోదరి సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. గత వారంలో తను ఆఫీస్ నుండి వస్తుంటే తన ముందే ఒక బైక్ యాక్సిడెంట్ అవ్వడంతో తన బైక్ పక్కన బెట్టి వెళ్లి చూసింది. ఆ వ్యక్తికి సాయం చేయడానికి ఎవరూ రాకపోయే సరికి, ఈ సిస్టర్ ఆ వ్యక్తికి సాయం చేయడానికి వెళ్ళింది. తనని చూసి మరో ఇద్దరు వస్తే ఒక కార్లో అ వ్యక్తిని దగ్గర్లోని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఈ సోదరి తన భర్తతో కలిసి రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యక్తిని దర్శించి వచ్చారు. ఆరు నెలల ప్రెగ్నన్సీతో ఉన్న మరో సిస్టర్ తన భర్తతో కలిసి గత వారంలో రోడ్డు మీద ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్న కొంత మంది దగ్గరికి వెళ్లి సువార్త పత్రికలు పంచుతూ కొంతమంది మహిళలతో సువార్త సంభాషణ చేసింది....