కొన్ని రోజుల క్రితం సంఘాలుగా కలిసి క్రికెట్ ఆడాము . ఇలా ఆడటానికి గల ముఖ్య ఉద్దేశం , సంఘాలుగా కలిసి పనిచేయడానికి గల సహవాసం పెంపొందించడానికీ మరియు ప్రేమ సంబంధాలు కట్టుకోవడానికి . ఆ రోజంతా చక్కగా క్రికెట్ ఆడటానికి దేవుడు మంచి స్థలం , వాతావరణం దయచేశాడు . మధ్య మధ్యలో వర్షం కురిసినా , మళ్ళీ ఆడేందుకు వాతావరణం చక్కగా సమకూర్చాడు . అయితే , ఆ రోజు క్రికెట్ ఆడడం ద్వారా దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను . 1. క్రికెట్ ఆటలో జట్టులోని సభ్యులందరూ కలిసి ఆడినప్పుడే విజయం లభిస్తుంది . మా జట్టు బౌలింగ్ చేసినపుడు చక్కగా బౌలింగ్ చేసేవారికి మాత్రమే అవకాశం ఇవ్వబడింది . బ్యాటింగ్ చేసినపుడు మొదటగా బ్యాటింగ్ లో నైపుణ్యం కలవారికే మొదట అవకాశం ఇవ్వబడింది . జట్టు నాయకుడు ఇతరులతో కలిసి ఎవరిని ముందుగా పంపాలి అనే నిర్ణయం చేసాడు . అలాగని మిగతా వారు తక్కువ స్థాయి కలవారు అని అర్థం కాదు . జట్టుకి ఎప్పుడు ఏది అవసరమో ముందు దానికి ప్రాధాన్యత ఇవ...