Skip to main content

Posts

Showing posts from April, 2023

సంఘ ప్రార్థన

యెషయా 56:7 నా మందిరము సమస్త జనులకు ప్రార్ధన మందిరమనబడును. ఈ వచనం పాత నిబంధనలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, తన ప్రజలను వివిధ దేశముల నుండి తన దగ్గరకు పిలుచుకొని, తన మందిరంలో వారి దహన బలులను, ప్రార్థనలను అంగీకరిస్తాడనే సందర్భంలో రాయబడింది. ఆ మందిరము సమస్త జనులకు ప్రార్ధన మందిరం అనబడుతుంది అని కూడా చెప్పబడింది. ఇదే మాటను మత్తయి 21:13 లో దేవాలయంలో వ్యాపారులను వెళ్ళగొడుతూ యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రస్తావిస్తాడు. పాత నిబంధనలో దేవుడు తన కొరకు మందిరం నిర్మించమని తన ప్రజలకు చెప్పి, ఆ మందిరంలో నివసించేవాడు.  యాజకులు, ప్రధాన యాజకులు, పాపక్షమాపణ కొరకైన బలులు ఇలా దేవుని సన్నిధిలో వివిధ పరిచర్యలు ఆ మందిరంలో జరిగేవి.  ఆ మందిరమును ప్రార్థన మందిరముగా వాక్యంలో పిలిచారు అంటే అక్కడ యెహోవా దేవుడికి ప్రాముఖ్యంగా ప్రార్థనలు కూడా అక్కడ జరిగేవి అని అర్థమవుతుంది. కానీ, నూతన నిబంధనలో 1 కొరింథి 3:16 ప్రకారం "మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు" చెప్పబడింది. ఇక్కడ "మీరు" అనగా కొరింథి లోని సంఘము. ఎఫెసీ 2:21 లో "ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చ...