"మా తల్లిదండ్రులు ఇదే సంఘ సభ్యులు నేను ఈ సంఘంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే సభ్యత్వం తీసుకున్నాను, ఇక ఇక్కడే బ్రదర్". ఇవి ఒక క్రైస్తవ సోదరుని మాటలు. ఒకవేళ ప్రతి క్రైస్తవుడు ఇలానే ఆలోచిస్తే క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళుతూ తన శిష్యులకిచ్చిన ప్రధానమైన,గొప్ప ఆజ్ఞ (మత్తయి 28:19,20) ఎలా నెరవేరుతుంది ? బాప్తీస్మమిచ్చుచూ, బోధించుచూ,సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి అనే ఆజ్ఞ కేవలం నాయకులకు మాత్రమే కాదు క్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి అని తెలుసుకోవాలి. మరోవైపు ఈ ఆజ్ఞను లోతుగా పరిశీలిస్తే, క్రీస్తు శిష్యులకిచ్చిన ఈ గొప్ప ఆజ్ఞ, సంఘ స్థాపన వైపు ప్రోత్సహించే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానిక సంఘ సందర్భంలోనే బాప్తీస్మం ఇవ్వడం క్రీస్తు బోధలను బోధించడం తద్వారా క్రీస్తు శిష్యులను తయారు చేయడం జరుగుతుంది కాబట్టి. పారా చర్చ్ సంస్థలు శిష్యత్వపు తర్ఫీదు అని టీచింగ్ చేయగలరు కానీ, బాప్తీస్మం ఇవ్వడం, పాస్టర్ల లాగా విశ్వాసుల ఆత్మీయ జీవితాలను పర్యవేక్షించడం చేయలేరు. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు, పారా చర్చ్ సంస్థల కొరకు కాదు. పౌలు సంఘాలకు ఉత్తరాలు రాశాడు, పార...