Skip to main content

Posts

Showing posts from October, 2022

దేవుని దయ

"క్రైస్తవ జీవితంలోని అద్భుతమైన వాస్తవాలలో ఒకటి ఏమిటంటే,  ఈ క్షయమవుతున్న ప్రపంచంలో,  దేవుని దయ ఎప్పుడూ పాతబడదు అనే వాస్తవం. ఆయన దయ ఎప్పటికీ ఆగిపోదు,ఎండిపోదు.   ఆయన దయ ఎప్పుడూ బలహీనమైపోదు, అలసిపోదు.  అవసరాన్ని తీర్చడంలో దేవుని దయ ఎప్పుడూ విఫలం కాదు. ఆయన దయ ఎప్పుడూ నిరాశపరచదు,ఎన్నటికీ విఫలం కాదు. ఎందుకంటే ఆ దయ ప్రతి ఉదయం నిజంగా కొత్తగా మనకు లభిస్తుంది.  విస్మయం కలిగించే దయ మందలించే దయ బలోపేతం చేసే దయ  ఆశలు కలిగించే దయ హృదయాన్ని బహిర్గతం చేసే దయ కాపాడే దయ మార్పు తెచ్చే దయ  క్షమించే దయ పోషించే దయ అసౌకర్యం కలిగించే దయ మహిమను బయల్పరిచే దయ సత్యాన్ని వెలిగించే దయ ధైర్యాన్నిచ్చే దయ దేవుని దయ ఒక రంగులో రాదు; ఆయన కృప అనే ఇంద్రధనస్సు యొక్క ప్రతి రంగు యొక్క నీడలో వస్తుంది.   దేవుని దయ వాయిద్యం యొక్క ఒక ధ్వని కాదు; ఆయన కృప అనే వాయిద్యం నుండి వెలువడే ప్రతి సంగీత ధ్వని దయగా వెలువడుతుంది. దేవుని దయ సాధారణమైనది;   ఆయన పిల్లలందరూ ఆయన దయలో మునిగిపోయారు.  దేవుని దయ నిర్దిష్టమైనది; ప్రతి వ్యక్తి వారి వారి నిర్దిష్ట క్షణం కోసం రూపొంద...