మత్తయి సువార్త 7: 3-5 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పై వచనాల అర్థమేంటి ? మనం ఇతరులను క్రిటిసైజ్ చేస్తాం అనగా సులువుగా విమర్శిస్తాం. తప్పుడు ఉద్దేశాలతో తీర్పు తీరుస్తుంటాం. మన సొంత జీవితాలను పరీక్షించుకోవడంలో మనల్ని మనం తీర్పు తీర్చుకోవడంలో ఫెయిల్ అవుతుంటాం. నలుసు చాలా చిన్నది దూలము అంటే చెట్టు యొక్క పెద్ద కాండం. ఇక్కడ యేసు చెబుతున్న విషయం ఏంటంటే మనలోనే చాలా బలహీనతలు తప్పులు ఉంచుకొని ఇతరుల జీవితాల్లో గల చిన్న విషయాలను బట్టి విమర్శ చేస్తుంటాం అనే సంగతి. అందుకే, ఒకాయన మనం ఇతరుల తప్పులను బట్టి తీర్పు తీర్చే మంచి న్యాయాధిపతులం కానీ, మన తప్పులను మనమే సమర్థించుకునే న్యాయవాదులం అన్నాడు అంటే డిఫెన్స్ లాయర్స్ మని అర్థం. దీనినే స్వనీతి వైఖరి అనొచ్చు. ఇతరుల ఉద్దేశాలను వారి హృదయంలో ఉన్న విషయాలన...