Skip to main content

Posts

Showing posts from August, 2022

సంఘం ఎవరిది ?

మత్తయి 16:18  మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. చాలామంది ఈ వచనాలను బోధిస్తూ పేతురు మొట్టమొదటి బిషప్ గా నియమించబడ్డాడు, ఆయన అధికారిగా ఆయన మీద కొత్త నిబంధన సంఘం కట్టబడింది అని చెబుతుంటారు. ఈ బోధ మొదలుపెట్టింది రోమన్ క్యాథలిక్ ప్రజలు. పేతురుకు సంఘం మీద అధికారం ఇచ్చి ఆయనను మొట్టమొదటి పోపుగా వాళ్ళు నియమించి ఈ బోధను అప్పట్లో చేశారు. ఆ తర్వాత పోప్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆదిమ అపోస్తుల బోధ ద్వారా దేవుడు సంఘాన్ని కట్టడం వాక్యం చెబుతున్నప్పటికీ (ఎఫేసీ 2:20), పేతురు లేదా ఇతర అపోస్తలులు మూల రాయిగా లేదా పునాదిగా దేవుడు తన సంఘం కట్టాడని, కడుతున్నారని చెప్పడం సరియైనది కాదు. ఈ వాక్య భాగాన్ని సరైన విధంగా అర్ధ వివరణ చేయకపోవడం వలన ఇటువంటి వాక్య విరుద్ధమైన విషయాలను సంఘానికి బోధించడం జరుగుతుంది. ఈరోజు ఆ వాక్యాన్ని వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. 1. నువ్వు పేతురువు ఇక్కడ పేతురు అన్న పదానికి అర్థం (లాటిన్ లో పెట్రస్ లేదా పెట్రోస్ ) రాయి అని.  ఈ పదం లాటిన్ భాషలో masculine prop...