Skip to main content

Posts

Showing posts from July, 2022

వాక్యానుసారమైన శిష్యత్వం

మత్తయి 28:19,20 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;  తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు  నామములోనికి  వారికి బాప్తిస్మమిచ్చుచు  నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.  ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. శిష్యులను ఎందుకు తయారు చేయాలి?   ఎందుకంటే అది ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు శిష్యులను చేయాలి? ఈ మాటలు,యేసు తాను పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళేముందు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు.  అప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి, నేడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి కూడా ఆ మాటలు వర్తిస్తాయి కాబట్టి, పాస్టర్లు, నాయకులు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు శిష్యులను చేయమని క్రీస్తు ఆజ్ఞాపించాడు అని ఈ వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే పై వాక్యం ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కాబట్టి. శిష్యులను చేయడం అనేది మన తోటి సోదరులు మరియు సోదరీమణులను క్రీస్తుతో సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా క్రీస్తు పోలికలో ఎదగడానికి సహాయం చేయడం తప్ప మరొకటి కాదు. అదే వాక్యానుసార...