లచ్చిమీ, లేవే, అయ్యో, నా పాణాన్ని పొట్టనవెట్టుకుండ్రు అని గుండెల మీద లచ్చమ్మ శవాన్ని వెట్టుకొని ఏడుస్తుండు రాములు. ఎవరో ఆమెను మెడ మీద కత్తితో పొడిచి చంపేశారు. ఊరవతల రైస్ మిల్లు దగ్గర శవం దొరికింది. లచ్చమ్మ, రాములు మంచి భార్యా భర్తలు. ఒకరంటే ఒకరికి మస్త్ ప్రేమ. రాములు పెద్ద కులంకి చెందినోడు. లచ్చమ్మ అదే ఊర్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన చిన్న కులపామె. రాములు మొదటిసారి లచ్చమ్మను సూడంగనే మనసు పారేసుకుండు. పోయి లచ్చమ్మని పెండ్లి చేస్కుంటనని వాళ్ల అయ్య దగ్గరికి పోయి అడిగిండు. అట్ల కాదయ్యా, మేము కిరిస్తానీయులం, మీరు పెద్ద కులం వాళ్ళు అని వద్దన్నారు. రాములు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పాస్టర్ సారు రాములును కూసోబెట్టి, బైబిల్ నుండి కొన్ని మాటలు సూయించి, యేసు సామి మన కోసం మన పాపాల కోసం సచ్చిపోయిండు అని మొత్తం చెప్పి, ముందు ఆ సామిని నమ్ముకో, పెళ్లి సంగతి తర్వాత అని సూటిగా చెప్పిండు. రాములు,ఆలోచనలో పడిండు. పాస్టర్ జెప్పిన మాటలు బాగా తాకినయి. నెల రోజుల తరవాత ఆయన దగ్గరికి పోయి " సార్, నేను యేసు సామిని నమ్ముకుంట...