నేను ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఇంకా అంటరానితనం ఇప్పటికీ మా కుటుంబాల్లో కొనసాగుతూనే ఉంది. నేను పెరిగేకొద్దీ నా తల్లిదండ్రులు వారి మధ్య గల సమస్యలు చూస్తూ చాలా బాధపడేదాన్ని. ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నందున నేను తరచుగా ఆత్మహత్య ఆలోచనలను కలిగి ఉండేదాన్ని. నేను చస్తే నా తండ్రిలో మార్పు వస్తుందని, కనీసం అప్పుడైనా మా నాన్న, నా చెల్లెలు మరియు తల్లిని చక్కగా చూసుకుంటాడేమో అని, నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నేను నా ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నప్పుడు, నా సీనియర్‌ను కలవడం జరిగింది. ఆమె తన స్నేహితుడి నుండి సువార్త విన్న విషయం నాకు వివరించింది. ఆత్మహత్య అనేది సరైంది కాదనీ,మన సమస్యలన్నింటికీ యేసు క్రీస్తు వద్ద పరిష్కారం దొరుకుతుందని నాకు చెప్పింది. మన జీవితాన్ని ఆయనకు ఇస్తే ఆయన మన జీవితాలను మారుస్తాడు అని చెప్పిన మాటలు నన్ను నిజంగా ఆలోచింపచేశాయి. అదే రాత్రి నేను యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాను. ఈ దేవుడు నా ప్రార్థన విన్నాడని,నా హృదయంలో ఆనందాన్ని అనుభవించాను. ఆ సమయంలో ఏడుస్తూ నేను యేసుక్రీస్తును మరింత తెలుసుకోవాలని ...