నువ్వు అలా ఎందుకు మాట్లాడావో నాకు తెలుసు, ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు తెలుసు, నీ మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడు వినేవే. మనం కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాం. కాని వీటిలో ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య ? అదే మనం ఇ ప్పుడు చదవబోతున్నాం. మనతో ఎప్పుడూ చురుగ్గా మాట్లాడే వ్యక్తి సడెన్గా మాట్లాడ్డం మానేస్తే, ఆ వ్యక్తి మనతో మాట్లాడకపోడానికి కారణం ఇదే కావచ్చు అని కొన్నివిషయాలు ఊహించుకుంటాం. సంఘానికి రెగ్యులర్గా వచ్చే వ్యక్తి 1-2 వారాలు రాకపోతే, ఆయన ఏదైనా పాపం చేసాడేమో, అందుకే రావట్లేదు కాబోలు అని తీర్పు చెప్పెస్తాం. ఒక బ్రదర్ లేదా సిస్టర్ గురించి మరేవరో ఏదైనా విషయం చెబితే, ఆ బ్రదర్ సిస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ఆ వ్యక్తి ఇలాంటి వాడా, ఆ సిస్టర్ ఇలా అనుకోలేదు అని అపోహలు పెంచుకుంటాం. ఇవి చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే, ఇవి వాక్య విరుద్ధమైన అభిప్రాయాలు లేదా అపోహలు కాబట్టి. ముందుగా చెప్పినట్లు, నాకు నీ మనసులో ఏముందో తెలుసు అని చెప్పడం, నీ హృదయ...