నే టి సంఘాలలో ఒకే వ్యక్తి నాయకునిగా ఉంటూ సంఘ పరిచర్య చేయడం మనం చూడగలం. కానీ,నూతన నిబంధనలో గల లేఖనాలు స్థానిక సంఘాలకు చెందిన బహుళనాయకత్వం గురించి ఎక్కువగా వివరిస్తుంది. ఒకరి కన్నా ఎక్కువ నాయకులు కలిసి సంఘ పరిచర్య చేయడాన్ని బహుళనాయకత్వంగా నిర్వచించగలం. బహుళ నాయకత్వం గురించిన లేఖన భాగాలు మొదట ప్రస్తావించి, ఆ పిదప దాని ద్వారా పరిచర్యలో కలిగే ఉపయోగాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లేఖన భాగాలు 1 . ఆదిమ సంఘములో అపోస్తలులు కలిసి పరిచర్య చేశారు. అపోస్త 2:14-36 లో పేతురు మొదటి ప్రసంగం చేయడం మనకు తెలిసిందే. ఇక్కడ ప్రసంగించింది పేతురే అయినా, ఇతర అపోస్తలులతో కలిసి ఆయన నిలబడి ఈ మాటలు చెప్పినట్లు 14 వచనంలో మనం చూడగలం. అంతే కాదు 32వచనంలో " ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమూ సాక్షులము " అని బహుళ పదాన్ని వాడాడు. 2. అపోస్త 11:30లో, యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం చేయడానికి పౌలు, బర్నబాల చేత అంతియొకయ లో గల పెద్దల యొద్దకు పంపిరి అని రాయబడింది. 3 . అపొస్త 14:20-23లో దేర్బే, లుస్త్ర, ఈకొనియ, అంతియొకయలో గల ప్రతి సంఘములో వారికి " పెద్దలను " ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థన చేసి,...