మన చుట్టూ ఎన్నో స్థానిక సంఘాలు పెద్ద పెద్ద సంఖ్యలపై ప్రత్యేక కార్యక్రమాలపై, కొత్త పుంతలు తొక్కుతూ పరిచర్యలు కొనసాగిస్తున్నాయి. కానీ విచారకరంగా చాలా స్థానిక సంఘాలు వాక్యానుసారమైన లక్షణాలు లేకుండా అనారోగ్యకరమైన రీతిలో సంఘాలు కొనసాగుతున్నాయి. మొదటిగా సంఘము అనగా నూతన నిబంధన ప్రకారం ఏమిటో తెలుసుకుందాం. దానికి ముందు సంఘము అనగా ఏది కాదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా సంఘం అంటే ఒక బిల్డింగ్ లేదా భవనం కాదు. ఒక ప్రదేశంలో ఇటుకల చేత సిమెంటు చేత నిర్మించబడిన ఒక భవనాన్ని సంఘం అనడం వాక్యానుసారం గా తప్పు. ఒక బిల్డింగ్ లో లేదా భవనంలో కూడుకోవడం తప్పు కాదు కానీ ఆ భవనాన్ని సంఘం అనడం బైబిల్ ప్రకారం తప్పు. ఎందుకు తప్పో చెప్పడానికి నేను రెండు ఉదాహరణలు మీతో పంచుకుంటాను. అపోస్తలుల కార్యములు 8:3 వ వచనంలో, సౌలయితే ఇంటింట జొచ్చి,పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను అని వ్రాయబడింది. ఇక్కడ సంఘము అనగా ఒక భవనమే అయితే సౌలు పాడు చేసింది ఒక భ...