బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు ముందు బైబిల్ గ్రంథములో ఏముందో ముందు తెలుసుకుందాం. దేవునిచే దేవుని ప్రజలకు ఇవ్వబడిన దేవుని వాక్యముగా బైబిల్ గ్రంథమును మనం నిర్వచించవచ్చు. దేవుని గుణలక్షణాలు,సృష్టి క్రమం, మానవ నిర్మాణం, పాపము దాని ప్రభావం, మానవ పతనం, దేవుని ఉగ్రత, మానవ పాప విమోచన ప్రణాళిక, దేవుని కుమారుని జనన మరణ పునరుత్తానం, విశ్వాస జీవితం, నూతన సృష్టి మొదలైన విషయాల గూర్చి కూలంకషంగా చర్చించిన చారిత్రాత్మక సత్య గ్రంథం బైబిల్. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచిన ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదముగా బైబిల్ గ్రంథమును పేర్కొనవచ్చును. విశ్వాసి యొక్క జీవితానికి ప్రామాణికం బైబిల్ వాక్యం. అందుకే విశ్వాసులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి, ధ్యానించాల్సిన అవసరం ఉన్నది. కీర్తనా కారుడు రచించిన 119వ కీర్తనలో దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములను గూర్చిన వివరణ ఇవ్వబడింది. కొత్త నిబంధన గ్రంథం అప్పటికి రాయబడలేకపోయినా, ఈ కీర్తన ద్వారా దేవుని గ్రంథమైన బైబిల్ ఎందుకు ధ్యానించాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1.119:2-3 - ఆయన శాస...