మొదటగా గర్భ స్రావం అనగా నిర్వచనం తెలుసుకుందాం. ఉద్దేశపూర్వకంగా, గర్భములో ఉన్న పిండము లేదా శిశువు జీవితాన్ని అర్థాంతరంగా ముగించే ప్రక్రియను ఆంగ్ల భాషలో అబార్షన్ అని , తెలుగులో గర్భస్రావం అని అంటారు. తమకు తాముగా కొన్ని వైద్యసంబంధ కారణాల వలన జరిగే గర్భస్రావం గురించి ఇక్కడ చర్చించట్లేదు కానీ, వ్యక్తిగతంగా లేదా ఇతరుల ప్రోద్భలంతో, ఉద్దేశ్యపూర్వకంగా వివిధ రకాలైన పద్ధతుల ద్వారా గర్భస్రావం చేయించుకునే విషయమే ఇక్కడ చర్చిద్దాం. గర్భస్రావం చేయించుకోడానికి గల ప్రాథమిక కారణాలు. 1. పెళ్ళికి ముందే లైంగిక సంబంధం వలన కలిగిన సంతానమును వదిలించుకోవాలని, తద్వారా సమాజం నుండి ఎదురయ్యే వివక్ష నుండి తప్పించుకోవాలని. 2. పెళ్లి తర్వాత అక్రమ సంబంధం వలన కలిగిన సంతానం వద్దనుకున్నపుడు. 3. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిసినపుడు మరియు రెండో సారి లేదా మూడో సారి ఆడ పిల్ల పుట్టినపుడు. 4. పుట్టబోయే బిడ్డ ఎదో అంగవైకల్యం కలిగున్నదని తెలుసుకున్నప్పుడు. 5. గర్భవతియైన తల్లి ప్రాణానికి సమస్య ఉత్పన్నమవుతుందనుకున్నపుడు. కారణాలేవైనా మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గర్భములో ఉన్న...