దేవుడు తన సంఘమునకు ఆజ్ఞలు లేదా నియమాలు సంఘ క్షేమాభివృద్ధికై దయచేసినాడు. ఆతిథ్యం ఇవ్వడం అనే దేవుని ఆజ్ఞ కూడా దేవుడు సంఘముయొక్క క్షేమముకొరకు ఇచ్చిన్నట్లుగా వాక్యంలో మనం చూడగలం. ఆతిథ్యం ఇవ్వడం దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటించే ఒక సాధనమైయున్నది. సంఘమును ప్రేమించుటకు ఆజ్ఞాపింపబడ్డ సంఘము చేయవలసిన మంచి కార్యము ఆతిథ్యం ఇవ్వడం అని తెలుసుకోవాలి. నూతన నిబంధనలో ఆతిథ్యం ఇవ్వడం అనే పదానికి గ్రీకులో అర్థం ఏమిటనగా "పరదేశులను ప్రేమించడం". పాత నిబంధనలోని లేవీ 19:33-34 వచనాలలో, " మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను"అని వ్రాయబడింది. అబ్రహాము నుండి కూడా ఆతిథ్యమును గూర్చి మనం నేర్చుకోగలం. ఆది 18:1-8 వచనాలలో తన ఎదుట గల ముగ్గురు మనుష్యులను తన గృహానికి ఆహ్వానించి వారికి భోజనం సిద్ధ పరిచిన సంఘటన వాక్యంలో మనకు పరిచయమే. వారెవరో తెలియకపోయినా, ఆతిథ్యం ఇవ్వడానికి ఆతృత పడిన అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు. నూతననిబంధన కాలంలో ఈ...