పాపని స్కూల్ లో జాయిన్ చేద్దామని తనని తీసుకొని బైకులో బయల్దేరాడు శంకర్. అడ్మిషన్ ఫార్మ్ లో ఏమేమి రాయాలో తలుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు రాగానే ఆ రోడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమాత్రం గుంతలు లేకుండా చక్కగా ఉంది. చాలా క్రమశిక్షణగా కార్లు, బైకులు వెళ్తున్నాయి, అసలు హార్న్ సౌండ్స్ వినపడటమే లేదు. ఇది మా పట్టణమేనా? రాత్రికి రాత్రి ఏమైంది ఈ నగరానికి అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు. రోడ్డు మీద అసలు చెత్త కనిపించడం లేదు. ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఆపగానే పరుగెత్తుకొని వచ్చే పిల్లలు కూడా అక్కడ లేరు. కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరైనా వచ్చి ఇలా మార్చేసారేమో అనుకున్నాడు శంకర్. అంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా, సైడ్ నుండి వచ్చి బైక్ ని గుద్దేసాడు ఓ యంగ్ మ్యాన్. శంకర్ మరియు పాప ఇద్దరూ కింద పడ్డారు. పాపకి తనకి ఏం అవ్వలేదని ఊపిరి పీల్చుకున్నాడు. బట్టలమీద పడ్డ దుమ్ము దులిపేసుకుంటుంటే, సారీ అంకుల్, నాదే తప్పు, సారీ అంటూ దండం పెడుతున్న యవ్వనస్తుణ్ణి చూస్తూ విస్తుపోయాడు. తప్పు మనదైనా, ఇటువంటి పరిస్థితిలో పక్కవాడినే టార్గెట్ చేసి పైసలు వసూలు చేయడం...