Skip to main content

Posts

Showing posts from April, 2021

శుభ శుక్రవారం రోజు జరిగిన శుభం ఏమిటి ?

గుడ్  ఫ్రైడే అంటే తెలుగులో శుభ శుక్రవారం. క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే  ఒక పండుగ గుడ్ ఫ్రైడే.  ప్రభుత్వాలు కూడా ఈ రోజును సెలవు దినంగా  ప్రకటించాయి. అసలు గుడ్ ఫ్రైడే నాడు జరిగిందేమిటి ?  శుభ శుక్రవారం రోజు జరిగిన శుభం ఏమిటి ?  ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే,  మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. ఆసియా ఖండంలోనే గల యెరూషలేము  అనే పట్టణానికి ఒక సారి వెళ్లొద్దాం.  ఆ రోజు శుక్రవారం.  ఒక వ్యక్తి భారమైన సిలువ మోస్తూ, కష్టంగా  నడుస్తున్నాడు. కొరడా దెబ్బలు ఆయన శరీరంలోని  మాంసాన్ని  లాగి పడేస్తున్నాయి. తలపై ముళ్లతో అల్లిన కిరీటం  తన మొఖాన్ని రక్తంతో నింపేసింది. రోమా ప్రభుత్వానికి చెందిన భటులు ఆ వ్యక్తిని అపహసిస్తూ,  అతి దారుణంగా కొడుతూ గొల్గోతా కొండ పైకి  తీసుకెళ్తున్నారు.  అసలే సిలువ భారం, ఒళ్లంతా గాయాలు,  ఆపై ఎత్తైన కొండ మీదికి ప్రయాణం.  ఆ వ్యక్తి ఎంతగా బాధననుభవిస్తున్నాడో  తల్చుకుంటే దుఃఖం పెల్లుబికి వచ్చిందేమో,  ఒక తల్లి విపరీతంగా ఏడుస్తూనే ఉంది. కొండ మీదకు రాగానే, ఆయన బట్టలు...