ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాధి గురించి చర్చిస్తోంది. ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి బారిన పడితే తీసుకోవాల్సిన చికిత్సల గూర్చిప్రతి ప్రభుత్వం వారి దేశ ప్రజలకు బోధించడం మన ప్రతి రోజు వార్తల్లో చూస్తున్నాం. ఒక వైపు భయపడాల్సిన అవసరం లేదంటూనే, మరో పక్క వ్యాధి తీవ్రతను వైద్యాధికారులు చెబుతూనే ఉన్నారు. అన్ని దేశాల ప్రజలు భయం భయంగానే రోజులు గడుపుతున్న పరిస్థితి. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు,మాల్స్ మూసివేశారు. సభలకు, సమావేశాలకు అనుమతి ఆపివేశారు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, అక్కడక్కడ మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, సృష్టికర్తయైన సార్వభౌముడైన త్రియేక దేవునియందు విశ్వాసముంచిన క్రైస్తవ సమాజం ఈ పరిస్థితికి ఎలా ప్రతిస్పందించాలి అనే ప్రశ్న నాకు కలిగింది. నాకు తట్టిన కొన్ని విషయాలు మన ఆత్మీయ ప్రోత్సాహం కొరకు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా , ఈ లోకంలో ప్రతి వ్యాధికి మూలం ఏదేను తోటలో ఆదాము, హవ్వల పాపంతో ప్రారంభమైనదని తెలుసుకుందాం. పాపము వలననే వ్యాధులు, రోగాలు, శ్రమలు మానవాళికి ...