దేవుడు ? ఈ లోకములో ఉన్నదంతయు తనంతకు తానుగా ఉనికిలోకి రాలేదు. ప్రతి వస్తువు వెనకాల దాని ఆవిష్కరణ కర్త ఉన్నట్లుగానే, విశ్వంలో గల వివిధ వ్యవస్థలను పరిశీలిస్తే ఈ సృష్టిని సృజియించిన సృష్టికర్త ఉన్నాడని నమ్మకతప్పదు. పదార్థాల కూర్పు, కణాల విస్ఫోటనం వలన లోకం ఆవిర్భవించిందనే నాస్తికుల వాదన ప్రశ్నించదగినదే. ఎందుకనగా విశ్వంలో గల పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసి, ఒక సమయములో విస్ఫోటనం చెందడం వలన గ్రహాలు,నక్షత్రాలు, భూమిపై జీవం ఆవిర్భవించిందనీ, ఇదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమని చెబుతుంటారు. కానీ ప్రశ్నేమిటంటే, “మొదటిగా పదార్ధం ఎక్కడిది “? ఎక్కడ నుండి వచ్చింది? ఈ పదార్ధం తనకు తానుగా ఆవిర్భవించిందా? కాస్త లోతుగా ఆలోచిస్తే “ఒక పదార్థ సమూహ విస్ఫోటనం, క్రమమైన అంతరిక్షాన్ని, భూమిని ఎలా కలుగజేయగలదు ? ఒకాయన ఈ విధంగా అన్నాడు, “ప్రింటింగ్ షాపులో విస్ఫోటనం సంభవిస్తే బూడిద వస్తుంది కానీ, ఎన్సైక్లోపీడియా గ్రంథం రాదు కదా “. చారిత్రక గ్రంథమైన బైబిల్ “దేవుడే అన్నిటికి మూలమనియు ఆయనే సర్వమును కలుగజేశాడనియు” సెలవిస్తుంది. శూన్యములో నుండి దేవుడు మాట ...