పొర్నోగ్రఫీ అనే మాటకు అర్థం తెలుగు ప్రజలకు మరియు ఇతర రాష్ట్రాల్లో గల చిన్నగ్రామాల్లో పట్టణాలలో గల ప్రజలకు అర్థం తెలియకపోవచ్చు. అశ్లీల రచనలు లేదా బూతు సాహిత్యాన్ని పొర్నోగ్రఫీ అంటారు. ఇంటర్నెట్ సదుపాయం మరియు మొబైల్ ఫోనులు లేకమునుపు పుస్తకాలలో పత్రికలలో ఈ అశ్లీల సాహిత్యం మరియు అశ్లీల చిత్రాలు ప్రజలకు లభించేవి. కానీ 4G వేగంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న ప్రపంచం అంతే వేగంగా మొబైల్ ఫోనులో ఈ అశ్లీల చిత్రాలు, వీడియోలు, సినిమాలు చూడడంలో కూడా అభివృద్ధి చెందుతుంది. మన భారతదేశం ఈ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా, టాప్ 10 దేశాల లిస్టులో చేరింది. క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు ఈ పొర్నోగ్రఫీకి అతీతులేమి కాదు. సంఘములో కూడా దీని వ్యసనం బారిన పడిన ప్రజలు ఉంటారని నేను నమ్ముతాను. కొందరు ఈ వ్యసనం నుండి బైటపడాలని ప్రయత్నిస్తుంటారు, మరికొందరు ఎలా బయటపడాలో అర్థం కాక నలిగిపోతుంటారు. ఈ ఆర్టికల్ పొర్నోగ్రఫీకి బానిసలుగా బ్రతుకుతున్న సోదరసోదరీమనులకు ...