సెక్షన్ 377ను రద్దు చేసి స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చి నెల రోజులు గడవకముందే భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 497 ను కూడా కొట్టివేసి మరో సంచలన ప్రకటన చేసింది. ఐపీసీ 497లో “ మరోకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధించిన నేరం” అని వ్రాయబడింది. ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధ నేరంగా పరిగణించి పురుషుడికి ఐదేళ్ల జైలు శిక్ష కానీ, జరిమానా కానీ లేదా రెండూ విధించేవారు. కానీ నేటి సుప్రీమ్ కోర్టు, ఈ చట్టాన్ని కొట్టివేసి వివాహేతర సంబంధం నేరం కాదు, అది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, భార్యల హక్కులను కాలరాస్తుంది అని తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు కావున ఈ విషయములో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అంతే కాక దీనిని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఈ సెక్షన్ 497 రద్దు వలన, వివాహ వ్యవస్థకు పెద్ద గాయమయ్యే అవకాశమున్నది. ఇప్పటికే వివాహేతర సంబంధాలు విజృంభించి ఎన్నో కుటుంబాలు విడిపోతున్న తరుణంలో ఈ తీర్పు భారత వివాహక్రమానికి మచ్చ తెచ్చేదే అని...